మహిళా రిజర్వేషన్ పై బీజేపీ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.
న్యూఢిల్లీ: ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీజేపీ మద్దతిచ్చిందని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని కోరుతూ భారత జాగృతి తలపెట్టిన దీక్షలో పాల్గొనేందుకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు న్యూఢిల్లీకి గురువారం నాడు రాత్రి చేరుకున్నారు.
undefined
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షా శిబిరం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మహిళా రిజర్వేషన్ విషయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని సత్యవతి రాధోడ్ గుర్తు చేశారు. ఈ విషయమై పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఈ దీక్షను ప్రారంభించినట్టుగా సత్యవతి రాథోడ్ చెప్పారు.
కవిత తలపెట్టిన దీక్షలో 19 పార్టీలు పాల్గొంటాయి. ఈ దీక్షను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారు.ఈ దీక్షను ప్రారంభించాలని సీతారాం ఏచూరిని కవిత నిన్న ఆహ్వానించారు. దేశంలోని పలు పార్టీలకు చెందిన మహిళా సంఘాల ప్రతినిధులు ఈ దీక్షలో పాల్గొంటారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాకు శస్త్రచికిత్స జరిగినందున ఈ దీక్షలో పాల్గోనడం లేదు. సీపీఐ తరపున ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ దీక్షలో పాల్గొంటారు. జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ పై దీక్ష నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.