కుమరంభీమ్ జిల్లాలో ఇద్దరిపై ఎలుగు బంటి దాడి: బాధితులు ఆసుపత్రికి తరలింపు

Published : Mar 10, 2023, 09:54 AM IST
కుమరంభీమ్ జిల్లాలో  ఇద్దరిపై  ఎలుగు బంటి దాడి: బాధితులు  ఆసుపత్రికి తరలింపు

సారాంశం

కుమరంభీమ్  ఆసిఫాబాద్  జిల్లాలో ని వేర్వేరు   ప్రాంతాల్లో  ఇద్దరిపై  ఎలుగుబంటి  దాడికి దిగింది.  ఈ దాడిలో  గాయపడినవారిని  ఆసుపత్రికి తరలించారు. 


ఆసిఫాబాద్:కుమరం భీమ్  ఆసిఫాబాద్  జిల్లాలోని వేర్వేరు  చోట్ల  ఇద్దరిపై ఎలుగు బంటి  శుక్రవారం నాడు దాడికి దిగింది.  ఈ  దాడిలో  తీవ్రంగా గాయపడిన ఇద్దరిని  ఆసుపత్రికి  తరలించి  చికిత్స అందిస్తున్నారు.

కుమరంభీమ్  జిల్లాలోని లోనవెల్లిలో వాకింగ్  కు వెళ్లిన  వ్యక్తిపై  ఎలుగుబంటి  దాడికి దిగింది. ఇదే  జిల్లాలోని  టోమ్కినిలో  పొలానికి  వెళ్లిన  భువనేశ్వర్ పై  ఎలుగుబంటి  దాడికి దిగింది.  ఎలుగు బంటి దాడుల్లో  గాయపడిన ఇద్దరిని  ఆసుపత్రికి తరలించారు  కుటుంబ సభ్యులు.గతంలో  కూడా  రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎలుగుబంటి  దాడుల్లో  పలువురు  గాయపడిన ఘటనలు  చోటు  చేసుకున్నాయి. 

ఆంద్రప్రదేశ్  రాష్ట్రంలోని  శ్రీకాకుళం  జిల్లాకిడిసింగి  గ్రామానికి  చెందిన  కలమట కోదండరావుపై ఎలుగుబంటి దాడి  చేసింది. ఈ దాడిలో  గాయపడిన  కోదండరావు  మృతి చెందాడు. ఈ ఘటన 2022 జూన్  21న  చోటు  చేసుకుంది. ఇదే గ్రామంలో  ఎలుగుబంటి  రెండు ఆవులపై దాడి  చేసి చంపింది.  , 
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు