వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ ది కీలక పాత్ర - ఐఎంఎఫ్

Published : Mar 07, 2024, 10:10 AM ISTUpdated : Mar 07, 2024, 10:11 AM IST
వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ ది కీలక పాత్ర - ఐఎంఎఫ్

సారాంశం

వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ కీలకంగా వ్యవహరించబోతోందని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ మేరకు బుధవారం తన తాజా అంచనాలను విడుదల చేసింది.

రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషించబోతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది. బుధవారం విడుదల చేసిన తాజా అంచనాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లలో చైనా, అమెరికా, ఇండోనేషియాలతో పాటు భారత్ కూడా ప్రపంచ ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుందని అంచనా వేసింది.

ఈ కాలంలో ప్రపంచ ఆర్థిక విస్తరణలో సగానికి పైగా ఈ నాలుగు దేశాల వాటా ఉంటుందని పేర్కొంది. కాగా.. 2023 సెప్టెంబర్ లో ఐఎంఎఫ్ చేసిన ఇలాంటి అంచనా వేసింది. మళ్లీ తన తాజా అంచనాలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత సత్తా.. షాంఘై వేదికగా మెరిసిన ప్రతిభ
Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం