తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ - రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు..

Published : Mar 07, 2024, 08:34 AM ISTUpdated : Mar 07, 2024, 08:39 AM IST
తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ - రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శలు..

సారాంశం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth reddy) పై కేటీఆర్ (KTR) ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ఆరోపించారు. గోల్డెన్ తెలంగాణ మోడల్ కంటే గోద్రా అల్లర్ల మోడల్ నచ్చిందా అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై (Telangana CM Revanth reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికకగా తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ఆదిలాబాద్ లో జరిగిన సభలో ప్రధాని మోడీని రేవంత్ కీర్తించిన నేపథ్యంలో కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. రేవంత్ కు తెలంగాణ ‘ఆత్మ’ లేదని, తెలంగాణపై ‘గౌరవం’ అంతకన్నా లేదని ఆరోపించారు. అందుకే తెలంగాణ ‘ఆత్మగౌరవం’పై మోడీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని విమర్శలు చేశారు.

నేడు కాంగ్రెస్ సీఈసీ మీటింగ్.. లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసే ఛాన్స్ ?

‘‘అసలు తెలంగాణ సోయి లేనోడు.. సీఎం కావడం మన ఖర్మ.. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం.. అసలు ‘గోల్ మాల్ గుజరాత్ మోడల్’ కు.. ‘గోల్డెన్ తెలంగాణ మోడల్’తో పోలికెక్కడిది.. ఘనమైన ‘గంగా జెమునా తెహజీబ్ మోడల్’ కన్నా..మతం పేరిట చిచ్చు పెట్టే ‘గోద్రా అల్లర్ల మోడల్’ నీకు నచ్చిందా..? ’’ అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్- బీజేపీల మధ్య పొత్తు : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి టంగ్ స్లిప్.. వీడియో వైరల్

‘‘నిన్నటి దాకా.. గుజరాత్ మోడల్ పై.. నిప్పులు ! ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే.. గొప్పలా ? ఇదేం నీతి.. ఇదేం రీతి.. తెలంగాణ మోడల్ అంటే.. సమున్నత సంక్షేమ నమూనా.. సమగ్ర అభివృద్ధికి చిరునామా.. అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్. యావత్ దేశానికే నచ్చిన మోడల్..
బుడిబుడి అడుగుల వయసులో, బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన..సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

‘‘ దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించ పరుస్తావా..? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..?? నాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావ్..నేడు తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావ్.’’ అని విమర్శలు చేశారు.

శెభాష్ రా బుడ్డోడా.. చిరుతను ఇంట్లో బంధించిన పిల్లాడు.. వీడియో వైరల్..

‘‘నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని  ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది.. బీఆర్ఎస్ కానీ.. నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది.. కాంగ్రెస్’’ అని కేటీఆర్ ‘ఎక్స్’లో సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సీఐడీ విచారణకు Padi Kaushik Reddy | Sammakka-Saralamma Jatara Case | BRS MLA | Asianet News Telugu
CM Revanth Reddy Speech: ఈలోపం దేశ భవిష్యత్తుకు చాలాఇబ్బందికరం | AI Challenges | Asianet News Telugu