ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. హైదరాబాద్‌లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు : మంత్రి తలసాని

By Mahesh Rajamoni  |  First Published Jul 23, 2023, 11:58 AM IST

Hyderabad: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. అయితే, ఇప్ప‌టివ‌రకు కురిసిన వాన‌ల కార‌ణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 428 మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని తెలిపారు.
 


Minister Talasani Srinivas Yadav visited Hussain Sagar: మ‌రో అల్ప‌పీడం ఏర్ప‌డే అవ‌కావ‌ముంద‌నీ, దీంతో ఈ నెల 26 వ‌ర‌కు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లో ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి. అయితే, ఇప్ప‌టివ‌రకు కురిసిన వాన‌ల కార‌ణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 428 మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని తెలిపారు.

గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న నగరంలోని హుస్సేన్ సాగర్ చెరువును అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 428 మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని తెలిపారు. ఎమర్జెన్సీ బృందాలు, పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. జీహెచ్ ఎంసీ మేయర్ విజయలక్ష్మీ ఆర్ గద్వాల కంట్రోల్ రూమ్ ను సందర్శించి బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. నగరంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ను ఆదేశించారు.

Latest Videos

undefined

ఇదిలావుంటే, తెలంగాణలో శనివారం భారీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో పాటు కొన్ని చోట్ల పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదే క్ర‌మంలో మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశ‌ముంద‌నీ, జూలై 24 నుంచి 26 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం ప్ర‌మాదాల‌ను నివారించ‌డానికి ముంద‌స్తు చర్య‌ల‌ను ప్రారంభించింది.

కాగా, వరుసగా ఐదో రోజు శనివారం కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలు పొంగిపొర్లుతుండగా, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని జగిత్యాలలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వాతావరణ బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కుమురం భీమ్ జిల్లాలోని సిర్పూర్ లో శనివారం ఉదయం 8.30 గంటల వరకు గరిష్టంగా 231.5 మిమీ వర్షపాతం నమోదైంది.

అలాగే, ఆ తర్వాత నిర్మల్ జిల్లా కడం పెద్దూరులో 224.8, నిర్మల్ జిల్లా పెంబిలో 154.3, కుమురం భీం జిల్లా జైనూర్‌లో 140.0 మిల్లీ మీట‌ర్లు, ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 115.6 మిల్లీ మీట‌ర్ల నుంచి 204.4 మిల్లీ మీట‌ర్ల వ‌రకు అతి భారీ వర్షపాతం నమోదైంది.

click me!