మ‌రో అల్ప‌పీడ‌నం.. ఈ నెల 26 వ‌ర‌కు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

Published : Jul 23, 2023, 11:29 AM IST
మ‌రో అల్ప‌పీడ‌నం.. ఈ నెల 26 వ‌ర‌కు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

సారాంశం

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. సముద్రంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున జూలై 24 నుంచి 26 వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.  

Telangana-heavy rains likely till July 26: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచ‌నా వేసింది. సముద్రంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున జూలై 24 నుంచి 26 వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. శ‌నివారం కాస్త త‌గ్గిన‌ట్టు క‌నిపించినా.. రానున్న ఐదు రోజుల పాటు చిరుజల్లులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. సముద్రంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున జూలై 24 నుంచి 26 వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ త‌న తాజా వాతావ‌ర‌ణ బులిటెన్ లో పేర్కొంది.

ఇదిలావుండగా, వర్షాలకు ప్రభావితమైన ప్రజలకు సహాయక బృందాల సహాయం అందింది. హైద‌రాబాద్ నగరంలోని కుషాయిగూడలో వాహనంపై చెట్టు విరిగిపడటంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందం ఓ వ్యక్తిని రక్షించింది.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ట్విట్టర్ ద్వారా వర్షాలకు సంబంధించిన సంఘటనలను నివేదించాలని ప్రజలను కోరారు. బాధితులు 040 21111111 , 90001-13667కు డయల్ చేయడం ద్వారా లేదా మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా సహాయం పొందవచ్చని కమిషనర్ ట్వీట్ చేశారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !