తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అలోకో అరాధే ఇవాళ ప్రమాణం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అలోక్ అరాధే ఆదివారంనాడు రాజ్ భవన్ లో ప్రమాణం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అరాధేతో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురు అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసుల మేరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఆరాధే నియామకానికి కేంద్రం అనుమతిని ఇచ్చింది. గత బుధవారంనాడు భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల తర్వాత జస్టిస్ ఆలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు. అంతకుముందు ఆయన కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర హైకోర్టులో పనిచేయడం కంటే ముందుగా ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పనిచేశారు. 2009 డిసెంబర్ 29న అరాధేను మధ్య ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2016 నుండి 2018 నుండి ఆయన జమ్మూ కాశ్మీర్ తాత్కాలిక సీజే గా పనిచేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ లో 1964 ఏప్రిల్ 13న ఆలోక్ ఆరాధే జన్మించారు. బీఎస్‌సీ, ఎల్ఎల్‌బీ ని పూర్తి చేసిన తర్వాత ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టారు.1988 జూలై 12న ఆలోక్ ఆరాధే న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నారు.2007 ఏప్రిల్ మాసంలో అలోక్ ఆరాధే సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. కంపెనీ చట్టాలు, మధ్యవర్తిత్వం సహా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలక కేసులు వాదించి ఆరాధే పేరు పొందారు.2009 డిసెంబర్ 29న ఆయన మధ్యప్రదేశ్ అదనపు జడ్జిగా నియమితులయ్యారు.
తెలంగాణ రాష్ట్రానికి ఆరో చీఫ్ జస్టిస్ గా అలోక్ ఆరాధే ఇవాళ ప్రమాణం చేశారు. ఇంతకుముందు జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పనిచేశారు.