పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో రూ.1.3 కోట్లకు టోకరా... బాధితుల్లో టెకీలు, ఆడిటర్, బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌ లు..

Published : Aug 29, 2023, 11:28 AM IST
పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో రూ.1.3 కోట్లకు టోకరా... బాధితుల్లో టెకీలు, ఆడిటర్, బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌ లు..

సారాంశం

పార్ట్‌టైమ్ జాబ్స్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ ల ఉచ్చులో పడి హైదరాబాద్ లో నెల వ్యవధిలో ఆరుగురు మోసపోయారు. దాదాపు రూ.13 కోట్లు నష్టపోయారు. 

హైదరాబాద్ : తక్కువ శ్రమ.. ఎక్కువ మనీ..అంటేనే మోసం అనే విషయం గుర్తించకుండా సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్న వారిలో హైదారాబాద్ కు చెందిన ఆరుగురు వ్యక్తులు రూ.1.3 కోట్లు మోసపోయారు. వీరిలో ముగ్గురు సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఒక ఆడిటర్, ఫార్మా ఇండస్ట్రీ వర్కర్, బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌లు ఉండడం గమనార్హం. 

పార్ట్‌టైమ్ ఉద్యోగం, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ లతో వీరు నెల రోజుల వ్యవధిలో మొత్తం 1.3 కోట్ల రూపాయలు కోల్పోయారు. వివరాల్లోకి వెడితే.. ఈ మోసంలో ముఖ్యంగా పుప్పాలగూడకు చెందిన 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేవలం 48 గంటల్లో గరిష్టంగా 58 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, టెక్కీకి వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. యూట్యూబ్ ఛానల్ కు  సబ్‌స్క్రయిబ్ చేస్తే.. ప్రతి సబ్‌స్క్రయిబ్ కు రూ. 50 ఇస్తామని ఆఫర్ చేస్తూ పార్ట్‌టైమ్ జాబ్ మెసేజ్‌ వచ్చింది. దీనికి అతను సరే అన్నాడు. 

మైనంపల్లిని రిప్లేస్ చేయనున్న కేసీఆర్?.. మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులు వీరే..!

రోజువారీ 25 యూ ట్యూబ్ చానల్స్ సబ్‌స్క్రయిబ్ లు చేయాల్సి ఉంటుంది.  దీంతోపాటు రీయింబర్స్‌మెంట్, లాభం అనే హామీలు ఇచ్చారు. అలా అతను నలుగురికి ముందే చెల్లించాల్సి వచ్చింది. ఆ తరువాత గ్రూప్ టాస్క్‌కి జోడించారు. అతను 33 లక్షలు వారికి కట్టాడు. ఆ తరువాత రూ. 52 లక్షల లాభం వచ్చినట్టు వర్చువల్ గా కనిపించింది. 

దీంతో సంబంరపడ్డ ఆ వ్యక్తి వీఐపీ సభ్యత్వం కోసం 22 లక్షలు చెల్లించాలని అడిగితే అవి కూడా కట్టాడు. ఆ తరువాత మరిన్ని డబ్బులు కావాలని వారు డిమాండ్ చేస్తుండడంతో అనుమానం వచ్చింది. వెంటనే టెక్కీ పోలీసులను ఆశ్రయించాడు, 58 లక్షల నష్టపోయినట్లు తెలిపాడు. 

ఇక ఈ ఘటనలో కొండాపూర్‌కు చెందిన 43 ఏళ్ల రెగ్యులేటరీ అసోసియేట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న మోసగాళ్ల చేతిలో పడి దాదాపు రూ. 35.5 లక్షలు   కోల్పోయారు. ఇది రెండో అతిపెద్ద మొత్తం.. 

ఆ తరువాత శంషాబాద్‌కు చెందిన 30 ఏళ్ల ఆడిటర్‌కు 16,000 జీతం, అమెరికన్ కంపెనీకి చెందిన ఆన్‌లైన్ ఉత్పత్తుల వర్చువల్ కొనుగోలు కోసం 0.4% కమీషన్ అని మాయమాటలు చెప్పి మోసగించి రూ. 21.8 లక్షలు టోకరా వేశారు. 

గచ్చిబౌలికి చెందిన 31 ఏళ్ల టెక్కీ ఉదంతం పుప్పాలగూడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేసును పోలి ఉంది. యూట్యూబ్ ఛానెల్‌లను సబ్‌స్క్రైబ్ చేసి లైక్ చేస్తే  50 చెల్లిస్తామని తెలిపారు. ఈ బేరంలో అతను 12 లక్షలు పోగొట్టుకున్నాడు.

ఘట్‌కేసర్‌కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఇలాంటి మోసానికి గురయ్యాడు, అయితే ఈసారి ఆఫర్‌ అదే.. కానీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలను లైక్ చేసి, ఫాలో కావాలని తెలిపారు. అలా చేస్తే ఒక్కో ఫేజ్ కి రూ. 50 చెల్లిస్తామన్నారు. అలా అతను రూ. 10.7 లక్షలను కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

మణికొండకు చెందిన ఒక టెక్కీ విషయానికొస్తే, ఫాలో, లైక్, సబ్ స్క్రైబ్ కాకుండా.. గూగుల్ మ్యాప్స్‌లో రెస్టారెంట్‌ను సమీక్షించమని అడిగారు. అది మోసం అని అతను గ్రహించే సమయానికి.. మోసగాళ్ళ చేతిలో 10.45 లక్షలు పోగొట్టుకున్నాడని పోలీసులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?