తెలుగు భాష దినోత్సవం 2023: తెలుగు భాష గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Published : Aug 29, 2023, 11:02 AM IST
తెలుగు భాష దినోత్సవం 2023: తెలుగు భాష గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

సారాంశం

Telugu Language Day 2023: ఒక్క మాతృభాషలోనే మన భావాలను ఇతరులకు సులువుగా అర్థమయ్యేట్టు చెప్పగలం. కానీ ప్రస్తుత కాలంలో చాలా  మంది తెలుగును మర్చిపోతున్నారు. దీన్ని మాట్లాడటానికి నామోషీగా ఫీలవుతున్నారు. కానీ తెలుగు భాషకున్న ప్రత్యేకత తెలిస్తే.. తెలుగు భాషను మెచ్చుకోకుండా చేయకుండా ఉండలేరు తెలుసా?   

Telugu Language Day 2023: 22 ప్రధాన భాషలను కలిగి ఉన్న భారతదేశం ప్రపంచంలోని అత్యంత సాంస్కృతిక వైవిధ్యమైన దేశాలలో ఒకటి. వీటిలో ప్రతి భాష గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. ప్రతి భాషను మాట్లాడటం గర్వించదగ్గ విషయం. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతీయ భాష తెలుగు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మీకు తెలుసా? తెలుగు భారతదేశంలో మాట్లాడే భాషల జాబితాలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఆగష్టు 29న తెలుగు రచయిత గిడుగు వెంకట రామమూర్తి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది ఈ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా మాతృభాషాభిమానులను గర్వపడేలా చేసే తెలుగు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో 4 వ స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం.. సుమారుగా 8.11 కోట్ల మంది మాతృభాష మాట్లాడేవారిలో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో నాల్గొవ స్థానంలో ఉంది. నిజానికి ఈ సంఖ్య దేశంలోని మొత్తం జనాభాలో 7% కంటే ఎక్కువ.

ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 లో..

మీకు తెలుసా? టర్కిష్, ఉర్దూ భాషలను అధిగమించి ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు 15వ స్థానంలో ఉంది.

రెండో ఉత్తమ స్క్రిప్ట్ గా ఓటు 

2012 లో తెలుగు భాష లిపిని ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్.. ప్రపంచంలో 2 వ ఉత్తమ లిపిగా ఓటు వేయగా.. కొరియన్ భాష ఉత్తమ లిపిగా ఓటు వేసింది.

ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్

తూర్పు ప్రపంచంలో ప్రతి పదం స్వర ధ్వనితో ముగిసే ఏకైక భాష తెలుగు. ఈ కారణంగానే ఈ భాషను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా కీర్తిస్తారు.

అత్యధిక సంఖ్యలో సామేతలు

తెలుగులో సామేతలకు కొదవ లేదు. మీకు తెలుసా? ఇతర భాషలతో పోల్చితే తెలుగులో సామేతులు ఎక్కువగా ఉన్నాయట. 

క్రీస్తుపూర్వం 400 నాటిది

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా భట్టిప్రోలులో క్రీస్తుపూర్వం 400 నుంచి క్రీస్తుపూర్వం 100 వరకు కొన్ని పదాలతో కూడిన ప్రాకృత శాసనాలు కనుగొనబడ్డాయని రికార్డులు సూచిస్తున్నాయి.

మయన్మార్ లో తెలుగులో ఒక వీధి

మయన్మార్ లోని మౌమైన్ లో మల్లె పూల దిబ్బా (మల్లెపూల వీధి) అనే వీధి కూడా ఉందని మీకు తెలుసా? 

రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రశంసలు

భారతదేశపు గొప్ప కవులలో ఒకరైన రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుగును మధురమైన భారతీయ భాషగా ప్రశంసించారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్