కొత్త ప్రభుత్వంలో తన పాత్ర ఏమీ ఉండదని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి (jana reddy) అన్నారు. ప్రభుత్వం కోరితే తప్పకుండా సలహాలు, సూచనలు ఇస్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (telangana cm revanth reddy), మంత్రులు అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు.
కొత్త ప్రభుత్వంలో తన పాత్ర ఏమీ ఉండదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సీఎల్పీ జానా రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కోరితే తన సలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సోమవారం ఉదయం ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని నరేంద్ర మోడీ స్పందన ఇదే..
అనంతరం రేవంత్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. అయితే తెలంగాణ హోం మంత్రి పదవిని జానారెడ్డికి ఇస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. దీనిపై ఆయన స్పందించి మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి తనను కోరారని జానారెడ్డి చెప్పారు. ప్రజలు అభిమానం పొందేలా పని చేయాలని తాను సూచించానని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ప్రకాశ్ రాజ్, మాజీ మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వంలో తన పాత్ర ఏమీ ఉండబోదని ఆయన తెలిపారు. సూచనలు, సలహాలు కోరితే తప్పకుండా ఇస్తానని చెప్పారు. అయితే అధిష్టానం ఆదేశిస్తే లోక్ సభకు పోటా చేస్తానని అన్నారు. ఈ విషయం తాను గతంలో కూడా చెప్పానని జానారెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను 15 ఏళ్లు మంత్రిగా సేవలందించానని గుర్తించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తన కుమారుడికి పదవి ఇవ్వాలని తాను సీఎంను కోరలేదని చెప్పారు. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన తన కుమారుడికి పదవి అడగడం కూడా సమంజసం కాదని తెలిపారు.
నిజమైన రైతులకే పెట్టుబడి సాయం... డిసెంబర్ చివరిలోగా ఖాతాల్లో డబ్బులు జమ.. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
కొత్త ప్రభుత్వంలో సీఎం, మంత్రులు అందరూ కలిసికట్టుగా పని చేయాలని జానారెడ్డి సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పని చేసి, వారి మనసులను గెలుచుకోవాలని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజల అభిమానాన్ని పొందాలని కోరారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు గాయం కావడం బాధాకరమని తెలిపారు. తాను కేసీఆర్ ను కలిసి పరామర్శించానని చెప్పారు. ఆయన త్వరగా కోలుకొని, ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు ఇవ్వాలని జానారెడ్డి ఆకాంక్షించారు.