హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (former cm kcr)ను ప్రకాశ్ రాజ్ (prakash raj) పరామర్శించారు. అక్కడే ఉన్న కేటీఆర్ (ktr)తో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మాజీ మంత్రులు గంగుల కమలాకర్ (gangula kamalakar), మల్లారెడ్డి (malla reddy)తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు (brs leaders) కేసీఆర్ ను పరామర్శించారు.
తుంటి ఎముకకు గాయమై హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పరామర్శించారు. సోమవారం ఉదయం సోమాజిగూడలో ఉన్న యశోదా హాస్పిటల్ కు ఆయన చేరుకున్నారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి మాట్లాడారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని నరేంద్ర మోడీ స్పందన ఇదే..
కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన కోలుకుంటున్నారని కేటీఆర్ బదులిచ్చారు. ఈ సమయంలో ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి, చల్మడ లక్ష్మి నరసింహారావు అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు.
జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి.. హోం మంత్రి పదవి ఆయనకేనా ?
కాగా.. ఆదివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించారు. ఉదయం సమయంలో హాస్పిటల్ కు చేరుకున్న రేవంత్ రెడ్డిని 9వ అంతస్తులో మాజీ మంత్రి కేటీఆర్ రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బెడ్ పై విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ను ఆయన కలిసి పలకరించారు. త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
నిజమైన రైతులకే పెట్టుబడి సాయం... డిసెంబర్ చివరిలోగా ఖాతాల్లో డబ్బులు జమ.. - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
అనంతరం కేటీఆర్ తో మాట్లాడారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ అధికారులను ఆదేశించారు. మాజీ సీఎం చికిత్సకు అవసరమైన సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. కాగా.. హెల్త్ సెక్రటరీ ద్వారా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.