NCRB: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సోమవారం ప్రచురించిన గణాంకాల ప్రకారం 2022లో మహిళలపై నేరాలు 4 శాతం పెరిగాయి. మహిళలపై మొత్తం నేరాల రేటు 65.4 శాతం ఉండగా, 75.9 శాతం మందిపై అభియోగాలు నమోదయ్యాయి.
Human Trafficking cases: మానవ అక్రమ రవాణ కేసుల్లో తెలంగాణలో గణనీయంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా సమాచారం ప్రకారం మానవ అక్రమ రవాణా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంపై ఆందోళనకరమైన విషయం. ఎన్సీఆర్బీ రిపోర్టుల ప్రకారం.. 2022లో దేశవ్యాప్తంగా 2250 కేసులు నమోదు కాగా తెలంగాణలో 391 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుల్లో 25 మంది బాలికలు, 9 మంది బంగ్లాదేశ్ యువతులు, 641 మంది మహిళలు, 38 మంది బాలురు సహా 704 మందిని రాష్ట్ర పోలీసులు రక్షించారు.
అలాగే, బాల కార్మికులను వారి తల్లిదండ్రుల వద్దకు తీసుకువచ్చిన కొంతమంది బాధితులను రెస్క్యూ హోమ్‌లకు తీసుకెళ్లారు. మరికొందరిని బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు. ఈ నివేదిక ప్రకారం 600 మందికి పైగా మహిళలు, 100 మంది పిల్లలను మెట్రో నగరాలకు అక్రమంగా రవాణా చేశారు. యువతులు, మైనర్లు అక్రమ రవాణాకు గురవుతున్నారు. తెలంగాణలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ లు చురుగ్గా పనిచేస్తుండటంతో కూడా కేసులు నమోదు పెరుగుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి, ప్రేమ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తెలంగాణకు తీసుకువస్తున్నారు. చివరకు వ్యభిచార కూపంలో దింపుతున్నారని రిపోర్టులు ఆందోళన వ్యక్తంచేశాయి.
undefined
బీహార్,ఉత్తప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాల నుండి బాల కార్మికుల అక్రమ రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు 30 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. కేంద్రం మార్గదర్శకాల మేరకు సీఐడీ పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, బాలల సంరక్షణ, స్థానిక పోలీసులు ఆపరేషన్ స్మైల్ పేరుతో దాడులు నిర్వహిస్తున్నారు.
ఇదిలావుండగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) సోమవారం ప్రచురించిన గణాంకాల ప్రకారం 2022లో మహిళలపై నేరాలు 4 శాతం పెరిగాయి. మహిళలపై మొత్తం నేరాల రేటు 65.4 శాతం ఉండగా, 75.9 శాతం మందిపై అభియోగాలు నమోదయ్యాయి. అత్యాచారాలు, అత్యాచారయత్నం, వరకట్న మరణాలు, యాసిడ్ దాడులు, ఇతర దాడులు, భర్త లేదా అతని కుటుంబ సభ్యుల క్రూరత్వం, మహిళలను కిడ్నాప్ చేయడం, అక్రమ రవాణా చేయడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో మహిళలపై దాడి, మహిళలపై సైబర్ నేరాలు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద నమోదైన నేరాలు తదితర నేరాలను పరిగణనలోకి ఎన్సీఆర్బీ మహిళలపై నేరాల రిపోర్టును తయారు చేసింది.