తాను ఎక్కడికి పారిపోలేదని సినీ నటి కరాటే కళ్యాణి చెప్పారు. తన వద్ద ఉన్న పాప పేరేంట్స్ తో కలిసి ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: నేనేక్కడికి పారిపోలేదని సినీ నటి కరాటే కళ్యాణి చెప్పారు. తన వద్ద ఉన్న పాప మౌక్తిక దత్తత తీసుకోలేదన్నారు. పాప వయస్సు ఏడాది దాటిన తర్వాత దత్తత తీసుకొంటానని ఆమె చెప్పారు.
సోమవారం నాడు రాత్రి karate Kalyani హైద్రాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పాప తల్లిదండ్రులతో కలిసి ఆమె మీడియా ముందుకు వచ్చారు. తనకు పిల్లలు లేరన్నారు. తనకు ఆడపిల్లలంటే ఇష్టమన్నారు.ఈ వివాదం వెనుక ఎవరున్నారో తనకు తెలుసునని చెప్పారు. తాను పిల్లలు అమ్ముకోవడం ఎవరు చూశారని ఆమె ప్రశ్నించారు. పాపకు ఏడాది పూర్తయ్యాక దత్తత తీసుకుందాం అనుకున్నానని ఆమె చెప్పారు.
undefined
also read:నోటీసులిచ్చినా కరాటే కళ్యాణి స్పందించలేదు: హైద్రాబాద్ కలెక్టర్
నేను పారిపోయే రకం కాదన్నారు.పరుగెత్తించే రకం అని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు. తనకు కొంచెం చట్టం కూడా తెలుసునని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.తాను ఎవరినీ దత్తత తీసుకోలేదన్నారు. నాకు siva shakti సంస్థతో విబేధాలున్నాయని ఆమె చెప్పారు. ఓ ఇల్లు కొనుగోలు విషయంలో విబేధాలున్నాయన్నారు. అప్పటి నుండి తనను వాళ్లు వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. Adoption విషయమై తాను పోలీసు అధికారులను హైద్రాబాద్ Collector ను Sharman కలుస్తానని కరాటే కళ్యాణి ప్రకటించారు. ఈ విషయమై లీగల్ గా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. నాకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. నా ప్రాణాలకు హాని ఉందని చెప్పారు. శివశక్తి సంస్థ తనను చంపాలని చూస్తుందని ఆమె ఆరోపించారు.
ఈ మీడియా సమావేశంలో మౌక్తిక తండ్రి కూడా మాట్లాడారు. తనకు ముగ్గురు ఆడపిల్లలే అని చెప్పారు. పిల్లలను పోషించలేక కళ్యాణి దగ్గర ఉంచామన్నారు. పాపకు మంచి భవిష్యత్ కోసమే ఇచ్చామన్నారు.పాప దత్తత ప్రాసెస్ పూర్తయ్యే వరకు పేరేంట్స్ గానే కరాటే కళ్యాని వద్ద ఉంటున్నామన్నారు.