ఈ నెల 21 నుండి జూన్ 21 వ తేదీ వరకు వరంగల్ డిక్లరేషన్ అంశాలను రైతు రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
హైదరాబాద్: ఈ నెల 21 నుండి జూన్ 21 వరకు వరంగల్ డిక్లరేషన్ లో పొందుపర్చిన అంశాలను రైతు రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకొన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
సోమవారం నాడు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం వివరాలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు.వరంగల్ రైతు సంఘర్షణ సభ ద్వారా Warangal Declaration ను ప్రకటించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మిల్లర్లు, దళారులు Farmers మోసం చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండి పోయిందన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతకడం కోసం వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించినట్టుగా Revanth Reddy చెప్పారు. రాష్ట్రంలోని 34 వేలకు పైగా పోలింగ్ బూతుల్లోని ఓటర్లకు వరంగల్ డిక్లరేషన్ ను వివరించాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి చెప్పారు.
undefined
ప్రతి Polling Booth లలో రైతు డిక్లరేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ఫ్లైక్సీల ద్వారా ప్రచారం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 400 మంది ముఖ్య నేతలు గ్రామాల్లో వరంగల్ డిక్లరేషన్ పై విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టుగా రేవంత్ రెడ్డి వివరించారు. ఒక్కో నాయకుడు 30 నుండి 40 గ్రామాల్లో ఈ విషయమై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఈ నెల 21వ తేదీ లోపుగా జిల్లా కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేసుకొని Rythu Racha banda కార్యక్రమానికి సంబందించి కార్యాచరణను సిద్దం చేసుకోవాలని ఆదేశించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రోఫెసర్ జయశంకర్ స్వగ్రామంలో తాను రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. అక్టోబర్ రెండు నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరగనుందన్నారు. తెలంగాణ నుండే పాదయాత్రను ప్రారంభించాలని తాము కోరాలని నిర్ణయం తీసుకొన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 100 కి.మీ దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర చేసేలా ప్లాన్ చేయాలని కూడా నిర్ణయం తీసుకొన్నామన్నారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శిబిర్ నిర్ణయాలను ఆమోదించినట్టుగా రేవంత్ రెడ్డి తెలిపారు.