పెద్దపల్లి జోన్ డీసీపీ రవిందర్‌ బదిలీ.. డీజీపీ ఆఫీసుకు అచాట్

Published : May 16, 2022, 05:39 PM IST
పెద్దపల్లి జోన్ డీసీపీ రవిందర్‌ బదిలీ.. డీజీపీ ఆఫీసుకు అచాట్

సారాంశం

పెద్దపల్లి జోన్ డీసీపీ రవిందర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను డీజీపీ ఆఫీసుకు అచాట్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

పెద్దపల్లి జోన్ డీసీపీ రవిందర్‌‌ను పోలీసు శాఖ బదిలీ చేసింది. రవీందర్ ప్రస్తుతం రామగుండం కమిషనరేట్ పరిధిలో డీసీపీగా పనిచేస్తున్నారు. అయితే ఆయనను డీజీపీ ఆఫీసుకు అచాట్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల కిందటే డీజీపీ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే రవీందర్ నేడు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. 

డీసీపీ రవీందర్‌ను ఆకస్మాత్తుగా బదిలీ చేయడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడంపై జిల్లా పోలీసు వర్గాల్లో విస్తృత చర్చ సాగుతుంది. అయితే  ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీసుకు అటాచ్‌ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ బదిలీకి గల వాస్తవ కారణాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు