హైద్రాబాద్ నెక్లెస్ రోడ్డులో కారులోనే మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బర్త్ డే పార్టీకి పిలిచి బాలికపై అత్యాచారం చేసిన సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే నెక్లెస్ రోడ్డు ఘటన చోటు చేసుకొంది.
హైదరాబాద్: Hyderabad లో కారులో మైనర్ బాలికపై అత్యాచారం చోటు చేసుకొంది.Jubilee hills గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే necklace roadలో కారులోనే మైనర్ బాలికపై Rape చోటు చేసుకొంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
birth day పార్టీకి పిలిచి కారులోనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం మేరకు నిందితుడు సురేష్ ను రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న సమయంలోనే ఈ ఘటన వెలుగు చూసింది.
undefined
also read:ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదు: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని అమ్నేషియా పబ్ నుండి బయటకు వచ్చిన తర్వాత మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.
అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.
కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.
ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన కార్లలో కూడా పోలీసుటు టెక్నికల్ ఎవిడె్న్స్ ను సేకరించారు. నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారును రెండు రోజుల క్రితం పోలీసులు సీజ్ చేశారు. అంతకు ముందే బెంజీ కారును కూడా పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.