హైదరాబాద్ విద్యార్థికి రూ.1.30కోట్ల స్కాలర్ షిప్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన వేదాంత్...

Published : Aug 06, 2022, 12:16 PM IST
హైదరాబాద్ విద్యార్థికి రూ.1.30కోట్ల స్కాలర్ షిప్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన వేదాంత్...

సారాంశం

ఓ హైదరాబాద్ విద్యార్థికి అమెరికాకు చెందిన యూనివర్సిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.1.30కోట్ల స్కాలర్ షిప్ ఇచ్చి ప్రోత్సహించింది. 

హైదరాబాద్ : హైదరాబాద్ కు చెందిన 18 యేళ్ల ఓ విద్యార్థికి బంపర్ ఆఫర్ ఇచ్చింది అమెరికాలోని ఓ యూనివర్సిటీ. వేదాంత్ ఆనంద్ వాడే అనే విద్యార్థి కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్ షిప్ అందించనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్ షిప్ లెటర్ ను పంపించింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐపీఎస్ఈ సిలబస్ తో 12వ తరగతిని పూర్తి చేశాడు వేదాంత్. ఇప్పుడు అమెరికాలో న్యూరోసైన్స్ చదవనున్నాడు. 

విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్ట్సేరిటీ గ్లోబల్ అతన్ని గుర్తించి తగిన మార్గదర్శకం చేసింది. ఈ నెల 12న వేదాంత్ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ వైద్యశాస్త్రంలో వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాకుంలో ఉందని, 17 మంది నోబెల్ పురస్కార గ్రహీతలను అందించింది అన్నాడు. అలాంటి వర్సిటీలో చదువుకునేందుకు ట్యూషన్ ఫీజు మేరకు స్కాలర్ షిప్ లభించిందని చెప్పారు. నాన్న ప్రైవేట్ ఆస్పత్రిలో డెంటిస్టుగా, అమ్మ ఫిజియోథెరిపిస్ట్ గా పనిచేస్తున్నారని వేదాంత్ తెలిపాడు. 

వెలుగులోకి చీకోటి ప్రవీణ్ పరిచయాలు.. 20 మంది వీఐపీలతో సంబంధాలు!.. ఈడీ విచారణకు పిలుస్తుందా..?
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?