మునుగోడు: ప్రియుడి మోజులో.. భర్తను చంపేందుకు ప్లాన్.. సుపారీ ఇచ్చి మరీ..!

Published : Aug 06, 2022, 10:35 AM IST
  మునుగోడు:  ప్రియుడి మోజులో.. భర్తను చంపేందుకు ప్లాన్.. సుపారీ ఇచ్చి మరీ..!

సారాంశం

నిమ్మల స్వామి అనే వ్యక్తిపై ఈ దాడి జరగగా.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.  

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు పేరు ఎక్కువగా వినపడుతోంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. అలాంటి మునుగోడు ఇటీవల కాల్పుల కలకలం రేగింది. ద్విచక్రవాహనం పై వెళ్తున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు తుపాకీలతో కాల్చారు. ఈ కాల్పుల ఘటన తీవ్రం కలకలం రేపింది. కాగా.. ఆ వ్యక్తి పై హత్యాయత్నం జరగడానికి.. వివాహేతర సంబంధమే కారణమని తేలింది. అతని భార్యే.. చంపడానికి ప్రయత్నించిందని తేలడం గమనార్హం.

నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం-ఉగొండి శివారులో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేగింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిమ్మల స్వామి అనే వ్యక్తిపై ఈ దాడి జరగగా.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు.

స్వామి భార్య.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరూ కలిసి ఉండాలంటే.. భర్త అడ్డుగా ఉన్నాడని ఆమెకు అనిపించింది. అందుకే ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. కిరాయి గుండాలను మాట్లాడి వారికి  రూ.లక్ష సుపారీ కూడా ఇచ్చింది. ముగ్గురు వ్యక్తులు.. స్వామి బయటకు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో కాపు కాచి.. తుపాకీతో కాల్చారు. స్వామిపై దాడి చేసిన తుపాకీ నాటు తుపాకీగా పోలీసులు గుర్తించారు. స్వామి శరీరంలోకి మూడు తపాకీ గుండ్లు దూసుకుపోగా.. సర్జరీ చేసి వాటిని తొలగించారని వైద్యులు తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. స్వామి భార్యపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో.. ఆమెను విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్వామి భార్య, ఆమె ప్రియుడు సహా మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?