పంజాగుట్ట చిన్నారి హత్య కేసు: ఇద్దరి అరెస్ట్

By narsimha lodeFirst Published Nov 12, 2021, 12:57 PM IST
Highlights

పంజాగుట్టలో ఐదేళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు పురోగతిని సాధించారు.  వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఓ మహిళతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: హైద్రాబాద్ పంజాగుట్టలో  చిన్నారిని  హత్య  కేసులో  ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదేళ్ల చిన్నారిని హత్య చేసిన కేసులో ఓ మహిళతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కర్ణాటక రాష్ట్రంలో అరెస్ట్ చేసిన ఇద్దరిని హైద్రాబాద్ కు తీసుకొస్తున్నారు.వివాహేతర సంబంధమే చిన్నారి హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఈ నెల 4వ తేదీన Panjagutta ద్వారకాపురి కాలనీలో గల ఓ దుకాణం ముందు girl మృతదేహన్ని  స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం బాలిక కడుపులో బలంగా తన్నడం వల్లే చనిపోయిందని నివేదిక అందింది. అయితే ఈ ప్రాంతంలోని cctv పుటేజీని పరిశీలించిన Police కీలక విషయాలను గుర్తించారు. నిందితులు ఉపయోగించిన వాహనాలను గుర్తించారు.ఈ వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. ఈ సమాచారం ఆధారంగా నిందితులు karnatakaకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

also read:పంజాగుట్టలో కలకలం.. షాప్ ఎదుట ఐదేళ్ల బాలిక మృతదేహం..

బెంగుళూరులో బాలికను చంపి hyderabad లోని పంజాగుట్టలో చిన్నారి డెడ్‌బాడీని వదిలివెళ్లారు. ద్వారకపురి కాలనీలోని మూసి ఉన్న దుకాణం వద్ద చిన్నారిని వదిలిన మహిళ మెహిదీపట్టణం వెళ్లినట్టుగా సీసీటీవీ పుటేజీలో పోలీసులు గుర్తించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు.ఈ చిన్నారి హత్య కేసును సీరియస్ గా తీసుకొన్న పోలీసులు నాలుగైదు బృందాలుగా ఏర్పడి నిందితులను వారం రోజుల్లో అరెస్ట్ చేశారు. బెంగుళూరులో హత్య చేసిన చిన్నారిని హైద్రాబాద్ పంజాగుట్టలో ఎందుకు వదిలేశారనే విషయమై కూడా పోలీసులు నిందితులను విచారించనున్నారు.చిన్నారిని హత్య చేసిన ఘటనలో పాల్గొన్న ముగ్గురిని పోలీసులు హైద్రాబాద్ కు తీసుకొస్తున్నారు. అయితే ఈ చిన్నారి ఎవరు.. హత్య చేసింది ఎవరనే విషయమై హైద్రాబాద్ పోలీసులు మీడియాకు వివరించనున్నారు. 

click me!