గిరిజనుడిని చితక బాదిన ఆత్మకూర్ ఎస్ఐ: వీఆర్ కు పంపిన ఎస్పీ

By narsimha lodeFirst Published Nov 12, 2021, 12:27 PM IST
Highlights


సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ఐ లింగం యాదవ్ పై ఎస్పీ బదిలీ వేటు వేశారు. ఆత్మకూర్ ఎస్ మండలంలోని ఏపూరు గ్రామంలో దొంగతనం కేసులో వీరశేఖర్ ను చితకబాదాడు.ఈ ఘటనను నిరసిస్తూ  గిరిజనులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) ఎస్ఐ లింగం యాదవ్ పై  బదిలీ వేటు పడింది. లింగం యాదవ్ ను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.ఆత్మకూర్ ఎస్ మండలంలోని ఏపూర్ లో దొంగతనం జరిగింది, ఈ కేసులో వీరశేఖర్  అనే యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తీవ్రంగా లింగయ్య కొట్టాడు. దీంతో వీరశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు.ఆత్మకూర్ ఎస్ మండలంలోని ఏపూర్ లో దొంగతనం జరిగింది, ఈ కేసులో వీరశేఖర్  అనే యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తీవ్రంగా లింగయ్య కొట్టాడు. దీంతో వీరశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనను నిరసిస్తూ గురువారం నాడు ఆత్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ ముందు  వీరశేఖర్ గ్రామానికి చెందిన వారంతా ఆందోళనకు దిగారు. వీరశేఖర్ ను తీవ్రంగా కొట్టిన ఎస్ఐ లింగం యాదవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై విచారణ అధికారిగా డిఎస్పీని నియమించారు ఎస్పీ. ఈ విషయమై డిఎస్పీ నివేదిక ఆధారంగా ఎస్ఐ లింగం యాదవ్ పై ఎస్పీ చర్యలు తీసుకొన్నారు. లింగం యాదవ్ ను వీఆర్‌కి అటాచ్డ్ చేస్తూ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

also read:‘జైభీమ్‌’... సూర్యాపేటలో గిరిజనుడిపై థర్డ్ డిగ్రీ...

Aipurలో జరిగిన దొంగతనం కేసుపై సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు Naveen అనే యువకుడిని అరెస్ట్ చేశారు. నవీన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నలుగురిని ఈ కేసులో అదుపులోకి తీసుకొన్నారు. అయితే Veera Shekar పొలంలో పనిచేస్తున్న సమయంలో సివిల్ దుస్తుల్లో వచ్చిన Police వీరశేఖర్ ను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టారని బాధితుడు మీడియాకు తెలిపారు.పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత వీరశేఖర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.  ఈ ఘటనను నిరసిస్తూ వీరశేఖర్  నివాసం ఉంటున్న రామోజీ తండాకు చెందిన వాసులు గురువారం నాడు Atmakur (s)పోలీస్ స్టేషన్ ముందు గిరిజనులు ఆ:దోళనకు దిగారు.

ఈ ఆందోళనతో  ఎస్ఐ లింగం యాదవ్ దిగొచ్చారు. గ్రామ పెద్దలతో రాజీ కోసం ప్రయత్నించారు. కానీ వీరశేఖర్ కుటుంబసభ్యులు మాత్రం అంగీకరించలేదు. గిరిజనుల ఆందోళనతో ఎస్పీ స్పందించారు. డీఎస్పీని విచారణ  అధికారిగా నియమించారు. డీఎస్పీ విచారణ నివేదిక ఇవ్వడంతో ఎస్ఐని వీఆర్ కు అటాచ్జ్ చేస్తూ ఎస్పీ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.ఇదిలా ఉంటే వీర శేఖర్ పై థర్డ్ డిగ్రీని ప్రయోగించలేదని ఎస్ఐ లింగం యాదవ్ తండా వాసులకు చెప్పారు. అయితే అర్ధరాత్రి వరకు ఎందుకు అతడిని స్టేషన్ లో పెట్టుకొన్నారంటే సరైన సమాధానం చెప్పలేదని తండా వాసులు చెబుతున్నారు. ఏపూరులో ఇటీవల చోటు చేసుకొన్న 10 నేరాలలో వీర శేఖర్ అనుమానితుడని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై ప్రశ్నించామని పోలీసులు చెప్పారు . 10 వ్యవసాయ మోటార్ల దొంగతనం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

click me!