
హరితహారం పేరుతో తెలంగాణ సర్కారు వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇంచు జాగా మిగలకుండా మొక్కలు నాటే పని చేపట్టింది. కానీ హైదరాబాద్ రోడ్లను సరిగా పట్టించుకుంటలేదు సర్కారు. దీంతో కొందరు వ్యక్తులు సరికొత్త నిరసన కార్యక్రమం చేపట్టిర్రు. హైదరాబాద్ రోడ్ల మీద గుంటలు పడి నీరు నిండిపోయవడంతో ఆ ప్రదేశంలో మొక్కలు నాటిర్రు. చూడడానికి ఇదేదో నిజమైన హరితహారంలా కనిపించినా, జనాల అవస్థలను తెలియజేసేందుకు ఈ మార్గం ఎంచుకున్నరు. మరి ఈ హరితహారం చూసైనా జర రోడ్లు బాగు చేయిరి సార్లూ.