మీరా కుమార్ ను చులకన చేసిన కెసిఆర్

First Published Aug 2, 2017, 10:27 PM IST
Highlights
  • మీరాకుమార్ పై కెసిఆర్ అసహనం
  • ఆమెకు స్థానిక పరిస్థితులేం తెలుసు
  • ఆమెకు నచ్చకపోతే బొగ్గు తెలంగాణనా?

మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ పై తెలంగాణ సిఎం కెసిఆర్ చులకన చేసి మాట్లాడారు. ప్రగతి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మీరా కుమార్ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఆమెను ఉద్దేశించి మీరా కుమార్ లేదు, ఓరా కుమార్ లేదు అంటూ హేళనగా మాట్లాడారు.  ఓరా కుమారో అంటూ ఎగతాళిగా మాట్లాడారు.

సిరిసిల్ల దళితులపై దాడుల నేపథ్యంలో మీరాకుమార్ సిరిసిల్ల పర్యటనకు వచ్చారు. ఆమె బాధితులను పరామర్శించి కంటతడి పెట్టుకున్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ ప్రశ్నించారు. ఆమెకు నచ్చితే బంగారు తెలంగాణ లేదంటే బొగ్గు తెలంగాణ నా అని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన ఆమెను అలా అంటారెందుకు అన్న ప్రశ్నకు ఆమేనా తెలంగాణ ఇచ్చిందని సిఎం ఎదురు ప్రశ్నించారు. ఆమెకు స్థానిక పరిస్థితులేం తెలియదని సిఎం పేర్కొన్నారు.

ఇక ఆమెతోపాటు జైరా రమేష్, దిగ్విజయ్ సింగ్ లాంటి జాతీయ నేతలను కూడా కెసిఆర్ ఉతికి ఆరేశారు. వారితోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలను, కాంగ్రెస్ పార్టీని తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టి పారేశారు.

మీరా కుమార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తరుణంలో ఆమె హైదరాబాద్ వచ్చారు. అప్పుడు సిఎం కెసిఆర్ కు ఫోన్ చేసినా ఆయన ఆమె ఫోన్ కు స్పందించలేదు. ఎలాగైనా కెసిఆర్ ను కలిసి వెళ్తానని, ఆయన సపోర్టు కోరతానని ఆమె అన్నారు. కానీ కెసిఆర్  ఆమెను కలవకుండా మొహం చాటేశారు. తర్వాత ఆమె కెసిఆర్ ను కలుసుకోకుండానే వెనుదిరిగారు. 

పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు సమయంలో మీరాకుమార్ లోక్ సభ స్పీకర్ గా ఎనలేని పాత్ర పోశించారని, ఆలాంటి వ్యక్తి పట్ల  సిఎం కెసిఆర్ ప్రవర్తించిన తీరు సరిగా లేదని తెలంగాణవాదులు అంటున్నారు. 

click me!