40 వేల పోస్టులతో మెగా డీఎస్సి వేయాలి

Published : Aug 02, 2017, 07:36 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
40 వేల పోస్టులతో మెగా డీఎస్సి వేయాలి

సారాంశం

మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు నిరుద్యోగ జేఏసి డిమాండ్ డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారానే డీఎస్సీ భర్తీచేయాలని   ప్రభుత్వానికి విన్నపం

 
తెలంగాణ ప్రభుత్వం వెంటనే 40 వేల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని   నిరుద్యోగ జెఏసి ఛైర్మన్‌ కోటూరి మానతా రాయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కేసీఆర్ ప్రభుత్వం  నిరుద్యోగ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. అలాగే డిఎస్సీ నోటిఫికేషన్ ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమీషన్ ద్వారా కాకుండా, డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారానే భర్తీచేయాలని ఆయన  ప్రభుత్వాన్ని కోరారు.
  బుధవారం  బీబీపేట మండలంలో పర్యటించిన ఆయన, నిజామాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నిరుద్యోగ  జేఏసి ఛైర్మన్‌ సంతోష్ గౌడ్ కలిసి విలేకర్లలో మాట్లాడారు.  2012డిఎస్సీ తరహాలోనే   ప్రస్తుత పరీక్షను కూడా  నిర్వహించాలని ఆయన కోరారు.అందుకోసం నిరుద్యోగ అభ్యర్థులు పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు.
ప్రభు త్వం ఆరేళ్లుగా డిఎస్సీ వేయక పోవటంలో చాలా మంది అభ్యర్థులు వయెపరిమితిని కోల్పోయారు.   కావున మరో రెండేళ్ళు  అంటే 46 ఏళ్ళవరకు  వయోపరిమితి  పెంచాలన్నారు.ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయకుంటే, నిరుద్యోగ జెఏసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు మానవతారాయ్ తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం