జగ్గారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు కాదు.. పక్కా ఆధారాలున్నాయి: డీసీపీ సుమతి

By sivanagaprasad KodatiFirst Published Sep 11, 2018, 10:43 AM IST
Highlights

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనను అరెస్ట్ చేశారంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన ఆరోపణలను హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ సుమతి కొట్టిపారేశారు. జగ్గారెడ్డి మనుషులను అక్రమంగా రవాణా చేసినట్లు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని.. ఇది రాజకీయ కక్ష సాధింపు కాదని ఆమె మీడియాకు తెలిపారు. 

2004లో ముగ్గురిని  అక్రమంగా విదేశాలకు పంపించారని.. భార్య, పిల్లలంటూ నకిలీ సర్టిఫికెట్లతో పాస్‌పోర్టులు పొందారని తెలిపారు. అమెరికా పంపించినందుకు గాను ముగ్గురి వద్దా భారీగా డబ్బులు వసూలు చేశారని సుమతి వెల్లడించారు.

నిన్న మార్కెట్ పీఎస్‌కు వచ్చిన ఫిర్యాదును నిశితంగా పరిశీలించిన తర్వాత దర్యాప్తు చేసినట్లు ఆమె వివరించారు.. ఆధార్ డేటా ఆధారంగా కేసును ఛేదించామని.. జగ్గారెడ్డిపై ఇమ్మిగ్రేషన్, పాస్‌పోర్ట్ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేశామని సుమత్తి తెలిపారు. ఈ కేసును మరింత నిశితంగా దర్యాప్తు చేస్తామన్నారు.

వాళ్ల అభ్యర్థిని గెలిపించుకోవడానికే.. నన్ను అరెస్ట్ చేశారు: జగ్గారెడ్డి

జగ్గారెడ్డి అరెస్టు: మనుషుల అక్రమ రవాణా కథా కమామిషు

తప్పించుకునేందుకు జగ్గారెడ్డి ఎత్తు: సంగారెడ్డి బంద్ కు పిలుపు

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు

click me!