మైనర్ కవలలపై అత్యాచారం.. కన్న తల్లి, మరో నలుగురికి జీవితఖైదు.. !

By AN TeluguFirst Published Aug 17, 2021, 10:36 AM IST
Highlights

తల్లికి చాలామంది పురుషులతో సంబంధాలుండేవి. ఆమె ఇద్దరు పిల్లలను వారి గదులకు పంపిస్తుండేది. తల్లి ప్రోద్భలంతో వారు ఈ చిన్నారుల మీద లైంగికదాడికి పాల్పడుతుండేవారు. ఇలా మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారు. 

హైదరాబాద్ : మైలార్‌దేవ్‌పల్లిలో 2016లో మైనర్ కవల సోదరీమణులపై సీరియల్ రేప్, వేధింపుల కేసులో బాధితుల తల్లితో సహా ఐదుగురికి ఎల్‌బి నగర్‌లోని స్థానిక కోర్టు సోమవారం జీవితఖైదు విధించింది. నేరానికి ప్రోత్సహించినట్లు తల్లిపై ఆరోపణలు వచ్చాయి. 

నేరం జరిగిన సమయంలో మైనర్లైన.. కవలల సోదరుడితో సహా మరో ముగ్గురిక వ్యతిరేకంగా నమోదనైన కేసులో తీర్పు జువనైల్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. బాధిత చిన్నారులు కుటుంబంలోని ఒక పెద్దకు విషయం తెలపడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, తల్లికి చాలామంది పురుషులతో సంబంధాలుండేవి. ఆమె ఇద్దరు పిల్లలను వారి గదులకు పంపిస్తుండేది. తల్లి ప్రోద్భలంతో వారు ఈ చిన్నారుల మీద లైంగికదాడికి పాల్పడుతుండేవారు. ఇలా మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారు. 

నిందితులలో వీరి ఇంటిపక్కనుండే తండ్రీ, మైనర్ కొడుకులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు.అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య పర్యవేక్షణలో 2016 నవంబర్‌లో దీనిమీద ఒక కేసు నమోదైంది. 2017లో ఛార్జిషీట్ దాఖలు చేయబడింది.

"ఈ కేసులో దర్యాప్తు అధికారి సహా మొత్తం 33 మంది సాక్షులను విచారించారు" అని మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్‌పెక్టర్ కె. నరసింహ తెలిసారు. పోక్సో చట్టం కింద నిందితులను దోషులుగా నిర్ధారించారు.

click me!