సువర్ణ ఆఫర్ లక్కీ డ్రా విన్నర్లు ప్రకటించిన ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో

By telugu teamFirst Published Nov 22, 2021, 7:58 PM IST
Highlights

మెట్రో సువర్ణ ఆఫర్ కింద గతనెల ప్రవేశపెట్టిన మంత్లీ లక్కీ డ్రా విన్నర్లను హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ఈ రోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఐదుగురు విజేతలను ప్రకటించి వారికి టెలివిజన్ సెట్, వాషింగ్ మెషీన్లు ఇతర గృహోపకరణాలు అందించారు. ఈ కార్యక్రమానికి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

హైదరాబాద్: Metro Suvarna Offer ప్రవేశపెట్టి నెల రోజులు విజయవంతంగా గడిచిన సందర్భంగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఆఫర్‌తో పాటే ప్రవేశపెట్టిన Monthly Lucky Draw లో విజేతను ప్రకటించింది. ఈ కార్యక్రమానికి  హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి, ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్ఎండీ సీవోవో సుధీర్ చిప్లుంకర్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. 2021 అక్టోబర్ నెల లక్కీ డ్రా విజేతలను ప్రకటించి  బహుమానాలను అందించారు. టెలివిజన్ సెట్, వాషింగ్ మెషీన్లు, మైక్రో ఓవెన్ సహా పలు గృహోపకరణాలను విన్నర్స్ గెలుచుకున్నారు.

లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్‌ కింద టెలివిజన్ సెట్‌ను విజేత ఎర్రం రాజశేఖర్ గెలుచుకున్నారు. ద్వితీయ, తృతీయ బహుమానాలుగా మౌనిక, పీవీ శ్రీకాంత్‌లు  వాషింగ్ మెషీన్లు సొంతం చేసుకున్నారు. నాలుగో, ఐదో ప్రైజ్‌గా రాజశేఖర్ రెడ్డి, శ్రీ బిందులు మైక్రోవేవ్ ఓవెన్‌లను  గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడారు. మెట్రో సువర్ణ ఆఫర్ 2021కు విశేష ఆదరణ రావడం సంతోషంగా ఉన్నదని అన్నారు. ప్రజలు గొప్పగా ఈ ఆఫర్‌ను స్వీకరించారని తెలిపారు. విజేతలు అందరికీ తన హృదయ పూర్వక అభినందనలు చెప్పారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణ సదుపాయం ఎంతో సురక్షితమైనదని, మరెంతో ప్రజా అనుకూలమైనదని వివరించారు. అందుకే హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించాలని ప్రజలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. 

Also Read: మెట్రో స్టేషన్‌లోనూ ‘బిగ్‌బాస్ చూస్తున్నాడు’.. నాగార్జున చేతుల మీదుగా అవగాన ప్రచారం ప్రారంభం

ఎల్ అండ్ టీ ఎంహెచ్ఆర్ఎల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ, మెట్రో సువరణ ఆఫర్ 2021 కింద తొలిసారి నిర్వహించిన నెలవారీ లక్కీ డ్రా గెలుచుకున్న వారందరికీ తన అభినందనలు అని తెలిపారు. ఈ ఆఫర్‌కు వచ్చిన ఆదరణ అద్భుతమని అన్నారు. మెట్రో రైలు ప్రయాణికులకు ఈ ఆఫర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని వివరించారు. టీకా పంపిణీ పెరగడం, కరోనా వెనకటి పరిస్థితులు నెమ్మదిగా నెలకొంటున్న తరుణంలో అన్ని కొవిడ్ జాగ్రత్తలతో మెట్రో రైలులో ప్రయాణాలు పెరుగుతున్నాయని అన్నారు. 

ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్ఎల్ సీవోవో సుదీర్ చిప్లుంకర్ మాట్లాడుతూ, లక్కీ విన్నర్స్‌కు తన కంగ్రాట్స్ అని చెప్పారు. ప్రతి ప్రయాణికుడిని సురక్షితంగా, సులువైన తీరులో గమ్యాలకు చేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇలాంటి ఆఫర్‌లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు మరింత సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. 

Also Read: ప్రయాణీకుడి విజ్ఞప్తి.. కేటీఆర్‌ రిక్వెస్ట్‌కు హైదరాబాద్‌ మెట్రో స్పందన, రేపటి నుంచి ఉదయం ఆరుకే సర్వీసులు

ఈ మంత్లీ లక్కీ డ్రా ఆఫర్‌ను మెట్రో సువర్ణ ఆఫర్‌లో భాగంగా అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఆఫర్‌లో పాలుపంచుకోవాలి ప్రయాణికులు అనుకుంటే.. నిర్దేశిత నెలలో వారు హైదరాబాద్ మెట్రో రైలులో మెట్రో స్మార్ట్ కార్డు ఉపయోగించి కనీసం 20 సార్లు ప్రయాణించాలి. ప్రయాణికులు టీసవారి యాప్‌లో మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసి ఉండాలి.. స్మార్ట్ కార్డ్ కూడా ఈ నెంబర్‌కే మ్యాప్ చేసుకుని ఉండాలి. లేదా ఈ ఆఫర్‌లో చేరడానికి టికెట్ కౌంటర్‌లో సంప్రదించాలి. ప్రతి నెల ఐదుగురు లక్కీ విన్నర్లు డ్రా తీస్తారు. విజేతలకు మెట్రో స్మార్ట్ కార్డుకు ఉపయోగించిన మొబైల్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ విషయం చెబుతారు.

click me!