ప్రియుడితో తిరగొద్దందని... తల్లి మెడకు చున్నీ చుట్టీ చంపిన మైనర్ కూతురు...

Published : Oct 19, 2021, 08:10 AM IST
ప్రియుడితో తిరగొద్దందని... తల్లి మెడకు చున్నీ చుట్టీ చంపిన మైనర్ కూతురు...

సారాంశం

పదిహేడేళ్ల వయసులో ప్రేమలో పడిన ఓ బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లినే కడతేర్చింది. ఇద్దరు minors ఓ నిందు ప్రాణాన్ని బలిగొన్న ఉదంతం hyderabadలో సంచలనం సృష్టించింది. హైదారబాద్ చింతల్ మెట్ లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. 

రాజేంద్రనగర్ : ప్రేమ పేరుతో కళ్లు మూసుకుపోయి కన్నతల్లినే కడతేర్చిందో కూతురు. తను ప్రేమించినవాడితో తిరగొద్దు అన్న పాపానికి లవర్ తో కలిసి అతి దారుణంగా హత్య చేసింది. కూతురుకు మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు ఆడియాసలయ్యాయి. ఇంత చేస్తే.. ఆ కూతురు మైనర్ కావడం.. ఆమె ప్రేమికుడూ మైనరే కావడం ఇక్కడ కొసమెరుపు.. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.

పదిహేడేళ్ల వయసులో ప్రేమలో పడిన ఓ బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లినే కడతేర్చింది. ఇద్దరు minors ఓ నిందు ప్రాణాన్ని బలిగొన్న ఉదంతం hyderabadలో సంచలనం సృష్టించింది. హైదారబాద్ చింతల్ మెట్ లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. 

రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, సీఐ కనకయ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ మెట్ లో నివసించే దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. చిన్నతనంనుంచి వీరికి అల్లారు ముద్దుగా పెంచారు. ఆ తరువాత ఓ మంచి సంబంధం చూసి...పెద్ద కూతురు వివాహం చేశారు. చిన్న కూతురు పదిహేడేళ్లదే కావడంతో ఆమె ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో చిన్న కూతురు (17) స్థానికంగా ఉండే ఓ పదిహేడేళ్ల బాలుడితో loveలో పడింది. 

ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. అది motherకి నచ్చలేదు. ఇంత చిన్న వయసులో ప్రేమ ఏంటి.. చదువుకోవాలని.. ఇలాంటివి తనకు నచ్చవు అంటూ ఇలా పలుమార్లు తల్లి మందలించింది. అతడిని కలవొద్దని, తిరగొద్దని సోమవారం మధ్యాహ్నం మరోసారి చెప్పింది. అయితే, daughter కి ఇది నచ్చలేదు. అందుకే, అదే సమయంలో ఆ బాలుడుని అక్కడికి రమ్మని పిలిచింది ఆ అమ్మాయి.

ఉద్యోగం కోసం వెడితే యువతిని ప్రేమలో దింపి.. సరోగసి రాకెట్ లో ఇరికించి..

వచ్చిన తరువాత వారిద్దరూ కలిసి తల్లితో గొడవ పడ్డారు. మాటా, మాటా పెరిగి అది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో తల్లి బతికుంటే తన జల్సాలకు, తిరుగుడుకు అడ్డు వస్తుందని భావించి కూతురు తల్లిని చంపాలని నిర్ణయించుకుంది. తల్లి మెడకు చున్నీ బిగించించింది కూతురు. ఈ హాఠాత్ పరిణామానికి తల్లి షాక్ అయ్యింది. కన్న కూతురు ఏం చేయబోతోందో ఊహించలేకపోయింది. అయితే ప్రేమ మత్తులో ఉన్న కూతురు... తన కన్న తల్లి అని కానీ తనను పెంచివిద్యాబుద్దులు నేర్పించదని కానీ ఆ సమయంలో గుర్తుకు రాలేదు. 

వాగ్వాదం లోనే తన ప్రేమను ఒప్పుకోవడం లేదని తల్లి మెడకు చున్నీ చుట్టింది.. బాలుడి సాయంతో గట్టిగా బిగించేసి murder చేసింది. ఇంకేముంది ఊపిరి ఆడక తల్లి అసువులు బాసింది. ఇదంతా జరుగుతున్న సమయంలో తండ్రి ఇంట్లో లేడు. 

తరువాత ఇంటికి వచ్చి చూస్తే భార్య విగతజీవిగా కనిపించడంతో.. అనుమానం వచ్చింది. స్థానికులకూ వీరి గొడవ విషయం తెలియడంతో వారూ అనుమాన పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడుని, బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

South Central Railway Announces Special Trains for Sankranthi 2026 | Pongal | Asianet News Telugu
Hyderabad History: నిజాంలనాటి చివరిగుర్తులు, మిగిలింది ఇవే..