వరుస చైన్ స్నాచింగ్ లు.. భార్యపై ప్రేమతోనే చోరీలకు చేస్తున్నానంటున్న దొంగ..

By SumaBala BukkaFirst Published Jan 28, 2022, 7:06 AM IST
Highlights

భార్యపై ప్రేమతోనే దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.ఛోరీలు చేసే సమయంలో సెల్ ఫోన్లో సిమ్ కార్డు తీసి వేస్తాడు. ఈ నెల 19న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు దొంగతనాలు చేసి పారిపోయాడు.  సవాల్గా తీసుకున్న పోలీసులు  నిందితుడి వివరాలు తెలుసుకునే లోపుగానే సొంతూరు అహ్మదాబాద్కు చేరాడు. 

హైదరాబాద్ : కరుడుగట్టిన గొలుసు దొంగ Umesh Khatik పోలీస్ రికార్డుల ప్రకారం ఇతర పేరు ఉమేష్ అలియాస్ లాలో గులాబ్జీ ఖతిక్. minorగా ఉన్నప్పుడే Chain snatchingల బాట పట్టాడు.  అరెస్టయి  jailలో వెళ్లినా బయటికి వెళ్లిన బయటకు వచ్చి వరుస చోరీలతో హల్ చల్ చేస్తుంటాడు.  

భార్యపై loveతోనే దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.  theftలు చేసే సమయంలో cellphone లో సిమ్ కార్డు తీసి వేస్తాడు. ఈ నెల 19న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు దొంగతనాలు చేసి పారిపోయాడు.  సవాల్గా తీసుకున్న పోలీసులు  నిందితుడి వివరాలు తెలుసుకునే లోపుగానే సొంతూరు అహ్మదాబాద్కు చేరాడు. 

 సీసీ టీవీ ఫుటేజ్, ఆధార్ కార్డు ఆధారంగా ఆచూకీ గుర్తించిన హైదరాబాద్ పోలీసులు విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులకు చేరవేశారు.  ఒక కేసులో కోర్టుకు తరలిస్తుండగా పారిపోయాడని అక్కడి పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మీరు transit వారెంట్ ద్వారా తీసుకువెళ్ళవచ్చు హైదరాబాద్ పోలీసులకు సలహా ఇచ్చారు. 

ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో అతని తీసుకురావాలా వద్దా అనే విషయాన్ని పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.  గతంలో ఉమేష్ ఇక్కడ ఏమైనా నేరాలు  చేశాడా?  అనే కోణంలో ఆరా తీస్తున్నారు.  గొలుసు చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుల జాబితాలో ఇతడు ఉన్నాడా?  అనే వివరాలు సేకరిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో  ఉమేష్ కత్తి పై కేసులు ఉన్నాయి.  ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా నిందితుడిని  అరెస్టు చేసేందుకు   సిద్ధమైనట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, జనవరి 24న wanted criminal చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ ను పోలీసులు హైదరాబాద్ కు తీసుకురానున్నారని ముందుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం chain snatcher అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరుసగా ఉమేష్ పై కేసులు ఉన్నాయి. నిందితుడు Ahmedabad Crime Branchకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. నిందితుడు ఉమేష్ ను సోమవారం పిటీ వారింట్ పై హైదరాబాద్కు తీసుకురావాల్సింది. 

ఈ నెలలో మూడు Commissionerates పరిధిలో గంట వ్యవధిలో 6 స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో నిందితుడు ని గుర్తించి పట్టుకున్నారు. చైన్ స్నాచింగ్ తెగబడుతున్న నిందితుడి ఆటకట్టించారు పోలీసులు. గంట వ్యవధిలోనే ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ చేసి పోలీసులకు సవాల్ విసిరాడు. ఎట్టకేలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఒకే రోజు గంటల వ్యవధిలో ఆరు చైన్ స్నాచింగ్ లకు పాల్పడి నగరవాసులను హడలెత్తించిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా చైన్ స్నాచర్ ను గుర్తించిన పోలీసులు.. నిందితుడు గుజరాత్ కు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసుల సాయంతో నిందితుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని హైదరాబాద్ తరలించడానికిి పోలీసులు కరోనా కేసుల ఉదృతి దృష్ట్యా ఆలోచిస్తున్నారు. 

click me!