‘‘ చాలా బాగా రాస్తున్నావ్, కీప్ రైటింగ్ ’’.. ఇగురం రచయితను గుర్తుపట్టి ప్రశంసించిన కేసీఆర్

By Siva KodatiFirst Published Jan 27, 2022, 9:06 PM IST
Highlights

గత నెలలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ’ఇగురం‘ (iguram) కథా సంపుటి పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని (gangadi sudheer reddy) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) అభినందించారు. ‘‘ఇగురం రచయితవు కదా... చాలా బాగా రాస్తున్నావ్, కీప్ రైటింగ్ అని గుర్తుపట్టి మరి అభినందించారు

గత నెలలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న ’ఇగురం‘ (iguram) కథా సంపుటి పుస్తక రచయిత గంగాడి సుధీర్ రెడ్డిని (gangadi sudheer reddy) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) అభినందించారు. గురువారం మంత్రి గంగుల కమలాకర్‌తో (gangula kamalakar) కలిసి సీఎం కేసీఆర్‌ని ప్రగతి భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు గంగాడి సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ‘‘ఇగురం రచయితవు కదా... చాలా బాగా రాస్తున్నావ్, కీప్ రైటింగ్ అని గుర్తుపట్టి మరి అభినందించారు. కేసీఆర్ స్వయంగా తనని గుర్తుపట్టడం, ఇగురం పుస్తకం గురించి విన్నాను, చదివాను అని తనతో ప్రస్తావించడంతో సుధీర్ రెడ్డి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. 

తన తొలి పుస్తకం ఇగురం సీఎం కేసీఆర్ వరకూ చేరడం, ఆయన దాన్ని చదవడం అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని రోజని.. గొప్ప అనుభూతి కలిగించిందన్నారు. ఈ సందర్బంగా సీఎంని కలిసేందుకు కారణమైన మంత్రి గంగుల కమలాకర్‌కి సుధీర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మానేరు గడ్డపై పుట్టడం, హైదరాబాద్ విభిన్న సంసృతి, తెలంగాణకున్న ఘనమైన సారస్వత వారసత్వం, సాహితీ సుక్షేత్రమే తన రచనలకు ఆలంభన అని సుధీర్ రెడ్డి తెలిపారు. మంచి సాహిత్యాన్ని ఆదరిస్తున్న పాఠకులకు, పాలకులకు, తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 
 

click me!