హెచ్‌సీఏలో మళ్లీ వివాదం: వాళ్లు భయపెడుతున్నారు.. అంబుడ్స్‌మెన్‌పై పోలీసులకు అజారుద్దీన్ ఫిర్యాదు

Siva Kodati |  
Published : Jan 27, 2022, 10:07 PM IST
హెచ్‌సీఏలో మళ్లీ వివాదం: వాళ్లు భయపెడుతున్నారు.. అంబుడ్స్‌మెన్‌పై పోలీసులకు అజారుద్దీన్ ఫిర్యాదు

సారాంశం

హైదరాబాద్‌ బేగంపేట్ పీఎస్‌లో హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌పై అజారుద్దీన్ (mohammed azharuddeen) ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్‌లో అంబుడ్స్‌మెన్ వారు భయపెడుతున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ బేగంపేట్ పీఎస్‌లో హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌పై అజారుద్దీన్ (mohammed azharuddeen) ఫిర్యాదు చేశారు. హెచ్‌సీఏ ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్‌లో అంబుడ్స్‌మెన్ వారు భయపెడుతున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్‌ ఫిర్యాదును బేగంపేట్ పోలీసులు స్వీకరించారు. అంబుడ్స్‌మెన్, అజారుద్దీన్‌ మధ్య కొద్దిరోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో వుంది. 

కాగా..జ కొన్ని నెలల క్రితం అజార్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ (apex council) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అంబుడ్స్‌మన్ దీపక్ వర్మతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అజారుద్దీన్. ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిల్ తరపు న్యాయవాది మరియు అజారుద్దీన్ తరపు న్యాయవాది వాదించిన వాదనలను విన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హెచ్ సి ఎ ప్రెసిడెంట్ పదవి నుంచి అజారుద్దీన్ తొలగిపోవాల్సిందేనని పేర్కొన్న సుప్రీంకోర్టు… దీపక్ వర్మ (deepak varma) వేసిన పిటిషన్ ను గతేడాది అక్టోబర్ 21న కొట్టివేసింది.

హెచ్‌సీఏ (hca) నియమ నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై ఆరోపణలు రావడంతో గతేడాది జూన్ 17న ఆయన్ని ఆ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అపెక్స్ కౌన్సిల్. అయితే జస్టిస్ దీపక్ వర్మ నేతృత్వంలోని కమిటీ... దీనిపై విచారణ జరిపి, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ‘అపెక్స్ కౌన్సిల్ తమ సొంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సరైన పద్దతిలో ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ అజారుద్దీన్‌ను సస్పెండ్ చేస్తూ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నా. వారు పంపిన షోకాజ్ నోటీసులు, ఇతరత్రా ఆదేశాలు కానీ చెల్లుబాటు కావు’ అంటూ తెలియచేశారు. 

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను తిరిగి నియమిస్తున్నట్టు ప్రకటించిన అంబుడ్సమన్, రిటైర్డ్ జడ్జ్ దీపక్ వర్మ, ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె జాన్ మనోజ్, ఆర్ విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధలపై తాత్కాలికంగా అనర్హత వేటు విధించారు. అయితే అంబుడ్స్‌మెన్  నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైరి వర్గం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై గతేడాది జూలై 7న తెలంగాణ హైకోర్టు (telangana high court) విచారణ నిర్వహించింది. ఈ విచారణలో అంబుడ్స్ మెన్ ప్రకటనపై స్టే విధించింది హైకోర్టు.
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu