అరటి పండ్ల లోడ్‌లో 110 కిలోల గంజాయి.. ఎల్‌బీ నగర్‌లో పట్టుకున్న పోలీసులు.. విశాఖ ఏజెన్సీ నుంచి..

Published : Oct 29, 2021, 03:26 PM IST
అరటి పండ్ల లోడ్‌లో 110 కిలోల గంజాయి.. ఎల్‌బీ నగర్‌లో పట్టుకున్న పోలీసులు.. విశాఖ ఏజెన్సీ నుంచి..

సారాంశం

హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో గత కొద్దిరోజులుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అంతేకాకుండా నిఘాను కూడా పెంచారు. ఈ క్రమంలోనే ఎల్బీనగర్‌ 110 కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో గత కొద్దిరోజులుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అంతేకాకుండా నిఘాను కూడా పెంచారు. ఈ క్రమంలోనే ఎల్బీనగర్‌ 110 కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాద్‌ మీదుగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్‌ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. 

గంజాయిని పట్టుకునేందకు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని సీపీ చెప్పారు. ఈ క్రమంలోనే విశాఖ ఏజెన్సీ నుంచి నాగ్‌పూర్‌కు రవాణా చేస్తున్న 110 కిలోల గంజాయిని సీజ్ చేశామని చెప్పాడు. నిందితులు అరటి పండ్ల లోడ్‌లో ఏర్పడకుండా గంజాయి తరలిస్తున్నట్టుగా తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 18.50 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు రవాణాకు ఉపయోగించిన మిని ట్రాన్స్‌పోర్ట్ వాహనాన్ని, మూడు మొబైల్ ఫోన్లను, రూ. 1100 నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా వెల్లడించారు. 

Also read: విశాఖపట్నం సీలేరు నుంచి హైదరాబాద్‌కు గంజాయి.. 70 కిలోలు స్వాధీనం..

అయితే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని సీపీ చెప్పారు. డ్రగ్స్ నివారణకు నయా సవేరా కార్యక్రమంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా సీపీ చెప్పారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోన డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తున్నట్టుగా తెలిపారు.

ఇక, గురువారం హైదరాబాద్ పోలీసులు విశాఖపట్నం జిల్లా సీలేరు (Sileru) నుంచి హైదరాబాద్ (Hyderabad) నగరానికి గంజాయి (Ganja) రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 10.50 లక్షల వివులైన 70 కిలోల గంజాయిని, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రమావత్ రమేష్, నర్సింగ్ సింగ్‌లుగా గుర్తించారు. వీరు కొంతకాలంగా సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అమ్మకాలు సాగిస్తున్నట్టుగా తేల్చారు. 

Also read: బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించే కుట్ర.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి

తాజాగా సీలేరు నుంచి తీసుకొచ్చిన 70 కిలోల గంజాయిని జూబ్లీహిల్స్ లోని రహమత్ నగర్‌లో అద్దెకు తీసుకున్న ఇంట్లో ఉంచారు. గురువారం నిందితులు రహమాత్ నగర్ ఇంట్లో నుంచి గంజాయిని ఆటోలో ఎక్కించుకుని.. బయలుదేరేందుకు సిద్దమయ్యారు. అయితే అప్పటికే అక్కడున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం నర్సింగ్, రమేష్‌లను పట్టుకుంది. మొత్తం 35 బండిల్స్‌లో ఉన్న 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. వారివద్ద నుంచి ఆటోను కూడా స్వాధీనం చేసుకన్నారు. మరో నిందితుడు రవి పరారీలో ఉన్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu