
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక సందర్బంగా రాజకీయ పార్టీలు తమకు డబ్బులు ఇవ్వడంలేదంటున్న ఓటర్లకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణ షాకిచ్చారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబపెట్టడానికి డబ్బులు ఇవ్వటమే కాదు ఓటర్లు డబ్బు తీసుకోవడం కూడా నేరమేనని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఇప్పటివరకు డబ్బులు రాలేదని ధర్నాలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు... ఇకపై అలా ఎవరైనా చేస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తామని సిపి హెచ్చరించారు.
హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ తో కలిసి సిపి సత్యనారాయణ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా karimnagar commissioner మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో 306 పోలింగ్ బూతుల్లో రక్షణ కోసం 20 కంపెనీల పారమిలటరీ దళాలు పని చేస్తున్నాయన్నారు. huzurabad bypoll కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే సి విజిల్ ఆప్ ద్వారా చేయవచ్చని సూచించారు. ఈ సి విజిల్ అప్ లో ఫిర్యాదు చేసినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.
''ఇప్పటివరకు హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో మూడున్నర కోట్లకు పైగా డబ్బులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే ఇప్పటివరకు 130కి పైగా ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లఘించారని... వారిపైనా కేసులు నమోదు చేసామన్నారు. 1321 మందిని బైండోవర్ చేశామన్నారు CP Satyanarayana.
''కొంత మంది కావాలని ఎన్నికలు, అభ్యర్థులు, పార్టీలపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఓటర్లనే కాదు అందరినీ అయోమయానికి గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలతో కూడిన పోస్టులు పెట్టినవారిపై ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదు చేశాం'' అని తెలిపారు.
read more Huzurabad Bypoll: ఆ పార్టీల డబ్బులు అందలేదంటూ ఓటర్ల ఆందోళన... గొడవకుదిగిన మహిళలు (వీడియో)
''ఏ పార్టీ నాయకులైనా ఇతర ప్రాంతాలకు చెందినవారుంటే అనుమతించడం లేదు. స్థానికేతరులు ఎవ్వరినీ నియోజకవర్గంలో ఉండటానికి అనుమతించడం లేదు. ఇతర ప్రాంతాల నాయకులు హుజూరాబాద్ ఉంటే కేసులు నమోదు చేస్తాం. ఇలాగే ఇప్పటివరకు నలుగురి పై కేసులు నమోదు చేశాం. సైలెన్స్ పీరియడ్ సమయంలో ఇతర ప్రాంతాల నాయకులు దాదాపు నాలుగు వేలమందిని బయటకు పంపించాము'' అని తెలిపారు.
''హుజూరాబాద్ నియోజకవర్గంలో 127 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. అక్కడ మరింత పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసాం. పోలింగ్ అయ్యేవరకు సర్వేలు నిషేధం. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసిన వారిపై విచారణ చేస్తున్నాం... అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి మీడియా సహకరించాలి'' అని సిపి సత్యనారాయణ కోరారు.
read more Huzurabad Bypoll: పోలింగ్ కు సర్వం సిద్దం... సిబ్బందికి కలెక్టర్ కర్ణన్ కీలక ఆదేశాలు
ఇక కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ... హుజురాబాద్ నియోజకవర్గంలో శనివారం ఉదయం 7గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఓటర్లు తమ ఐడి కార్డ్ తీసుకువెళ్లడం తప్పనిసరి అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఫోన్ అనుమంతించబోమని... మాస్క్ మాత్రం తప్పనిసరిగా వాడాలన్నారు.
''డబ్బులు పంపిణీ చేసే ప్రాంతాలను పోలీసులకు సమాచారం ఇవ్వండి. డబ్బులు పంపిణీ వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. డబ్బుల పంపిణీ వీడియోలను పరిశీలిస్తున్నాం. నిజానిజాలు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అని తెలిపారు.
''కోడ్ ను ఉల్లఘించిన 130మందిపై కేసులు నమోదు చేశాం.వికలంగులకు, సీనియర్ సిటిజన్, గర్భిణీ స్త్రీలకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా పేషంట్లు సాయంత్రం 6.30 తరువాత ఓటు హక్కు వినియోగించుకోవచ్చు'' అని కలెక్టర్ స్పష్టం చేసారు.