Huzurabad Bypoll: ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు... ఉద్రిక్తత

By Arun Kumar PFirst Published Oct 29, 2021, 3:04 PM IST
Highlights

హుజురాబాద్ లో పోలింగ్ కొన్నిగంటల ముందు వరంగల్ లో మీడియాతో మాట్లాడాలని భావించిన బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 

కరీంనగర్: హుజురాబాద్ ఓటర్లు తీర్పునిచ్చే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లోనే హుజురాబాద్ పోలింగ్ మొదలవనుంది. ఈ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి కార్యకలాపాలు జరక్కుండా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే huzurabad నియోజకవర్గం పక్కనే వున్న warangal లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేదర్ మీడియాతో మాట్లాడేందుకు సిద్దమవగా ఆ ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. 

ఇప్పటికే వరంగల్ eatala rajender ప్రెస్ మీట్ పెడుతున్నారన్న సమాచారంతో ముందుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన వరంగల్ కు రాగానే మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. అయినా ఈటల ఒప్పుకోకపోవడంతో ఆయనను వాహనశ్రేణిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. 

Latest Videos

హుజూరాబాద్ అసెంబ్లీ సీటు కరీంనగర్ లో వుంది కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో వుంది. అలాగే ఈ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండలం హన్మకొండ జిల్లాకిందకు వస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో వుంది. కానీ వరంగల్ జిల్లాలో ఎలాంటి ఎలక్షన్ కోడ్ లేకున్న పోలీసులు ఈటల ప్రెస్ మీట్ ను అడ్డుకోవడం ఏమిటని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులే ఈటలను అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. 

read more Huzurabad Bypoll: డబ్బులు రాలేవంటూ ఆందోళనకు దిగినవారిపైనా కేసులు: సిపి సత్యనారాయణ

గత బుధవారం సాయంత్రం హుజురాబాద్ లో ప్రచారానికి గడువు ముగిసింది. దీంతో అన్నిపార్టీల స్థానికేతర నాయకులు హుజురాబాద్ ను విడిచివెళ్లారు. ఇక స్థానిక నాయకులు తెరవెనుక రాజకీయాలను ప్రారంభించారు. ఓటర్లకు డబ్బులు పంచడం, మద్యం పంపిణీ, విందులివ్వడం ఇలా ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. 

హుజురాబాద్ లో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే తమకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇచ్చే డబ్బులు అందడంలేదంటూ కొందరు రోడ్డెక్కారు. ఓటేయాలంటే తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ ధర్నాలు చేయడం, ఆందోళనకు దిగడం చేస్తున్నారు. ఇక కొన్నిచోట్ల డబ్బులు పంచుతున్న వారిని ప్రజలే పోలీసులకు పట్టిస్తున్నారు. 

రాజకీయ పార్టీలు తమకు డబ్బులు ఇవ్వడంలేదంటున్న ఓటర్లకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణ షాకిచ్చారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోబపెట్టడానికి డబ్బులు ఇవ్వటమే కాదు ఓటర్లు డబ్బు తీసుకోవడం కూడా నేరమేనని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఇప్పటివరకు డబ్బులు రాలేదని ధర్నాలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు... ఇకపై అలా ఎవరైనా చేస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తామని సిపి హెచ్చరించారు.

read more  బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ గృహనిర్భందం... ఇంటిచూట్టూ భారీగా పోలీసుల మొహరింపు
 
హుజురాబాద్ నియోజకవర్గంలో శనివారం ఉదయం 7గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు తమ ఐడి కార్డ్ తీసుకువెళ్లడం తప్పనిసరి అని.... పోలింగ్ కేంద్రాల్లో ఫోన్ అనుమంతించబోమని... మాస్క్ మాత్రం తప్పనిసరిగా వాడాలని కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ సూచించారు.

హుజురాబాద్ పరిధిలోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులువ1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు. నియోజకవర్గంలో  144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు,891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగిస్తున్నారు... మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.

click me!