huzurabad bypoll: ఇంకా తేలని కాంగ్రెస్ అభ్యర్ధి, అక్టోబర్ 1న ఠాగూర్ హైద్రాబాద్ రాక

By narsimha lodeFirst Published Sep 28, 2021, 11:28 AM IST
Highlights


హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయమై కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్టోబర్ 1వ తేదీన మాణికం ఠాగూర్ హైద్రాబాద్ రానున్నారు. ఠాగూర్ హైద్రాబాద్ వచ్చిన తర్వాత ఈ విషయమై పార్టీ నాయకత్వం చర్చించనుంది.

హుజూరాబాద్:హుజూరాబాద్ అసెంబ్లీ (huzurabad bypoll)స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని కాంగ్రెస్ ఇంతవరు నిర్ణయించలేదు.అక్టోబర్ 1 వ తేదీన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణికం ఠాగూర్  (manickam tagore)హైద్రాబాద్ (hyderabad) రానున్నారు.

also read:హుజూరాబాద్, బద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల: సభలపై ఈసీ ఆంక్షలు

ఇప్పటికే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ  చేస్తున్నారు.ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తర్జన భర్జన పడుతుంది.గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్నారు. దీంతో కొత్త అభ్యర్ధి అన్వేషణలో ఆ పార్టీ నాయకత్వం ఉంది.

మాజీ మంత్రి కొండా సురేఖ పేరును ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. సురేఖతో పాటు కృష్ణారెడ్డి పేర్లు కూడ ఆ పార్టీ నాయకత్వం  పరిశీలనలో ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రబాకర్, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు అభిప్రాయాలే సేకరించిన తర్వాత అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది.

అక్టోబర్ 1వ తేదీన మాణికం ఠాగూర్ హైద్రాబాద్ కు రానున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. గత ఎన్నికల సమయంలో వచ్చిన ఓట్లను నిలబెట్టుకోవడంతో పాటు క్యాడర్ లో మనోధైర్యం నింపే అభ్యర్ధిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో నూతనోత్తేజం ఇచ్చే అభ్యర్ధి ఎవరనే విషయమై ఆ పార్టీ అన్వేషిస్తోంది.మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హుజూరాబాద్ లో పోటీ చేసే అభ్యర్ధి ఎంపికపై ఇప్పటికే రెండు దఫాలు జిల్లా నేతలతో చర్చించారు. 

click me!