వైద్యుల నిర్లక్ష్యం.. డెలివరీ అయిన కాసేపటికే బాలింత మృతి, ఉద్రిక్తత !

By AN TeluguFirst Published Sep 28, 2021, 10:42 AM IST
Highlights

సైదాబాద్ లక్ష్మీ నగర్ కు చెందిన బాలకృష్ణ భార్య పూజ (25)కు నెలలు నిండడంతో మొదటి కాన్సు కోసం ఈ నెల 25వ తేదీ ఆదివారం 3 గంటల ప్రాంతంలో సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పూజ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

హైదరాబాద్ : వైద్యుల నిర్లక్ష్యం (doctors negligence) వల్లే తమ కూతురు మృతి చెందిందని బాలింత (woman dies after giving birth) కుటుంబసభ్యులు చేపట్టిన ఆందోళన సుల్తాన్ బజార్ ( sultan bazar)ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు (tension situation)దారి తీసింది. ఐదు గంటలపాటు ఆస్పత్రిలో గందరగోళ పరిస్తితి నెలకొంది. పోలీసులు వచ్చి వైద్యులపై కేసు నమోదు చేయడంతో బాధితులు శాంతించారు. 

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ లక్ష్మీ నగర్ కు చెందిన బాలకృష్ణ భార్య పూజ (25)కు నెలలు నిండడంతో మొదటి కాన్సు కోసం ఈ నెల 25వ తేదీ ఆదివారం 3 గంటల ప్రాంతంలో సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పూజ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

హుజూరాబాద్, బద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల: సభలపై ఈసీ ఆంక్షలు

అయితే, వైద్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో బాలింతరాలు పూజ చనిపోయిందని చెప్పడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎలా చనిపోతుందంటూ కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశంసించారు. పూజకు డ్యూటీ వైద్యులు సరిగా కుట్లు వేయకపోవడంతోనే రక్తస్రావం ఎక్కువై.. మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా రెండో సారి వైద్యులు కుట్లు వేయడంతోనే పూజ మరణించిందని ఆందోళన దిగారు. తమ బిడ్డ వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆస్పత్రి ఎదుట ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు. 

అప్పుడే పుట్టిన చిన్నారిని అనాథగా మారిందని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడ ఉన్నవారికి కలిచి వేసింది. సమాచారం తెలుసుకున్న సుల్తాన్ బజాన్ ఇన్ స్పెక్టర్ భిక్షపతి, ఏసీపీ దేవేందర్ బంధువులకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేస్తామని బంధువులకు సర్ది చెప్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆపరేషన్  చేసిన డ్యూటీ డాక్టర్ మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్స్మి హామీ ఇచ్చారు. 

click me!