రవిశంకర్ గురూజీని కలిసిన బిజెపి ఎమ్మెల్యే ఈటల... గంటసేపు భేటీ... అందుకోసమేనా?

Arun Kumar P   | Asianet News
Published : Nov 23, 2021, 11:10 AM ISTUpdated : Nov 23, 2021, 11:13 AM IST
రవిశంకర్ గురూజీని కలిసిన బిజెపి ఎమ్మెల్యే ఈటల... గంటసేపు భేటీ... అందుకోసమేనా?

సారాంశం

ప్రముఖ ఆద్యాత్మికవేత్త రవిశంకర్ గురూజీ హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆయనను కలిసి దాదాపు గంటసేపు భేటీ అయ్యారు.

హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రముఖ ఆద్యాత్మికవేత్త రవిశంకర్ గురూజీతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని మానసగంగ ఆశ్రమానికి ravishankar guruji విచ్చేయగా ఆయనను eatala rajender మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈటెలలతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి కూడా రవిశంకర్ గురూజీతో దాదాపు గంటసేపు భేటీఅయ్యారు. ఈ భేటీపై ప్రజల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 

ఇదిలావుంటే huzurabad bypoll తర్వాత  తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. టీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ ను ఓడించడం సీఎం కేసీఆర్ వల్ల కాలేదు. దళిత బంధు వంటి అద్భుతమైన పథకంతో పాటు అభివృద్ది హామీలు, నేతల భారీ చేరికలు ఇవేవి టీఆర్ఎస్ పార్టీని గెలిపించలేకపోయాయి. ఈ ఉపఎన్నికలో ప్రత్యక్ష ఓటమి TRS అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దే అయినా పరోక్షంగా CM KCR ఓడిపోయినట్లు రాజకీయ విశ్లేషణలు జరిగాయి.  

ఇలా హుజురాబాద్ ఓటమి తర్వాత వెంటనే మేలుకున్న సీఎం కేసీఆర్ నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఈ ఒక్క ఓటమితో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతోందని భావించాడో ఏమో గానీ స్వయంగా తానే రంగంలోకి దిగిన కేసీఆర్ మళ్లీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రైతాంగం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వమే రోడ్డెక్కింది. కేంద్రంలో అధికారంలో వున్న BJP తో టీఆర్ఎస్ దోస్తీ దోరణికి స్వస్తిచెప్పి యుద్దానికి సిద్దమయ్యింది. 

read more  poonam kaur- Etela rajender: ఈటల రాజేందర్‌తో పూనమ్ కౌర్ మీటింగ్…కారణం అదేనా..?

ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి రాష్ట్ర బిజెపిని దెబ్బతీయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలకు టీఆర్ఎస్ దిగింది. ప్రస్తుతం వరి సాగు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవడానికంటూ సీఎం కేసీఆర్ డిల్లీలో పర్యటిస్తున్నారు. 

మరోవైపు బిజెపి కూడా టీఆర్ఎస్ పార్టీకి గట్టిగానే ఎదుర్కొంటోంది. వరి ధాన్యం కొనుగోలు ఆలస్యమమెందుకు అవుతోందని నిలదీస్తున్నారు. రైతులను స్వయంగా కలిసి వారి బాధలు తెలుసుకునేందుకు ఇటీవల తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఇలా టీఆర్ఎస్ కు బిజెపి గట్టిగానే కౌంటరిస్తున్నారు.   

ఓవైపు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ఎదుర్కొంటూనే మరోవైపు ఆ పార్టీని దెబ్బతీసేందుకు బిజెపి వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఇటీవల హైదరాబాద్ శివారులో బిజెపి సీనియర్లు సమావేశమై చర్చించారు. టీఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోవాలనే దానిపైనే ప్రధానంగా బిజెపి నాయకులు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 

read more  పతనం ప్రారంభమైంది: కేసీఆర్‌కు ఈటల రాజేందర్ కౌంటర్

ఇక హుజురాబాద్ గెలుపుతర్వాత ఈటల రాజేందర్ కూడా స్పీడ్ పెంచారు. రాష్ట్ర బిజెపి నాయకులతో కలిసిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అలాగే రాజకీయంగా కూడా తన బలాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కేసీఆర్ ను ఎదిరించి విజయం సాధించిన ఈటల బిజెపి అధిష్టానం దృష్టిలో పడ్డ ఈటల మరింతగా వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిజెపి పెద్దలతో మంచి సత్సంబంధాలున్న రవిశంకర్ గురూజీతో భేటీ అయినట్లు రాజకీయ చర్చ జరుగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?