Telangana Local body Mlc elections: ఖమ్మం, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ

By narsimha lodeFirst Published Nov 23, 2021, 10:02 AM IST
Highlights

 మెదక్, ఖమ్మం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ  ఎణ్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులకు ఆ పార్టీ నాయకత్వం బీ ఫారాలు కూడా అందించింది. 

హైదరాబాద్: తెలంగాణలోని స్థానిక సంస్థల కోటా  ఎమ్మెల్సీ ఎన్నికల్లో   పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఖమ్మం, మెదక్ జిల్లాలో పోటీ చేయనుంది. ఈ రెండు జిల్లాల్లో అభ్యర్ధులకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీ ఫారాలను అందించింది. మరో వైపు  నల్గొండ,లో పోటీ విషయమై పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరలేదు.

 Telangana Local body Mlc elections ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరగనున్నాయి. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గతంలో జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించారు. khammam  జిల్లాలో రాయల్ నాగేశ్వర్ రావును congress పార్టీ బరిలోకి దింపింది.  ఉమ్మడి medak  జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga reddy సతీమణి నిర్మలా జగ్గారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనన్నారు. వీరిద్దరికి టీపీసీసీ నాయకత్వం బీ ఫారాలను అందించింది.

nalgonda స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య ఏకాభిప్రాయం కుదరని కారణంగా ఈ ఎన్నికల్లో పోటీపై ఆ పార్టీ నాయకత్వం  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది.

also read:ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవ ఎన్నిక.. ధ్రువపత్రాలు తీసుకున్న ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్ధులు (ఫోటోలు)

.గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించడంతో  ఆయన  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.  దీంతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణిని బరిలోకి దింపారు. అయితే ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణిపై టీఆర్ఎస్ అభ్యర్ధి తేర చిన్నపరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ దఫా పోటీపై కాంగ్రెస్ పార్టీ కి చెందిన జిల్లా నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు  ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో  ఈ విషయమై చర్చించారు. జిల్లా నాయకులతో చర్చించి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయమై  పార్టీ నేతలు చర్చించారు. అయితే పోటీపై నేతల మద్య ఏకాభిప్రాయం కుదరలేదు.  దీంతో  ఈ విషయమై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

click me!