ఆస్తి కోసం.. యాసిడ్ తాగించి, బట్టల్లేకుండా గదిలో బంధించి : భార్యపై భర్త పైశాచికం

Siva Kodati |  
Published : Jan 23, 2022, 03:42 PM ISTUpdated : Jan 23, 2022, 03:44 PM IST
ఆస్తి కోసం.. యాసిడ్ తాగించి, బట్టల్లేకుండా గదిలో బంధించి : భార్యపై భర్త పైశాచికం

సారాంశం

హైదరాబాద్‌లోని (hyderabad) సైదాబాద్‌లో (saidabad) దారుణం జరిగింది. ఆస్తి  కోసం కట్టుకున్న భార్యనే చిత్రహింసలు పెట్టి చంపేందుకు ప్రయత్నించాడో భర్త. వివస్త్రను చేసి గదిలో నిర్బంధించాడు. యాసిడ్ తాగించి హత్యాయత్నం చేశాడు. 

హైదరాబాద్‌లోని (hyderabad) సైదాబాద్‌లో (saidabad) దారుణం జరిగింది. ఆస్తి  కోసం కట్టుకున్న భార్యనే చిత్రహింసలు పెట్టి చంపేందుకు ప్రయత్నించాడో భర్త. వివస్త్రను చేసి గదిలో నిర్బంధించాడు. యాసిడ్ తాగించి హత్యాయత్నం చేశాడు. డాక్టర్లు నాలుగు సర్జరీలు చేయడంతో ప్రాణాపాయం తప్పిందని బాధితురాలు వాపోతోంది. పోలీసులు తనకు న్యాయం చేయాలని తన భర్త నుంచి రక్షణ కల్పించాలని కోరుతోంది బాధితురాలు. ఆమె భర్త ధర్మా నాయక్ నాగార్జున సాగర్ (nagarjuna sagar) ప్రాజెక్ట్ ఎస్ఈగా పనిచేస్తున్నారు. 

2008లో అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి తనపై వేధింపులు మొదలయ్యాయని బాధితురాలు చెబుతోంది. తాను చేస్తోన్న బ్యాంక్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అతని వేధింపులు భరించలేక సైదాబాద్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశానని చెబుతోంది. ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో తన పేరు మీద వున్నవి.. తన పేరు మీదకు బదలాయించాలని వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. 

ఈ నెల 4న భర్త.. అతని తల్లి , సహచరులు బలవంతంగా తనతో యాసిడ్ తాగించారని ఆరోపించింది. ఇంటి నుంచి బయటకు వస్తే వారి భండారం బయటపెడతానని.. వివస్త్రను చేసి ఒక గదిలో బంధించారని ఆమె చెబుతోంది. ఎలాగోలా వారి చెర నుంచి బయటపడ్డానని.. ఆస్తులు తనకు వద్దని అన్ని ఇచ్చేస్తానని, కానీ తన భర్త తనను ప్రాణాలతో వదలడని ఆమె భయపడుతోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!