Miryalaguda Murder: కట్టుకున్న భార్యను అతికిరాతకంగా హతమార్చిన కసాయి భర్త

Arun Kumar P   | Asianet News
Published : Jan 23, 2022, 11:35 AM ISTUpdated : Jan 23, 2022, 11:43 AM IST
Miryalaguda Murder: కట్టుకున్న భార్యను అతికిరాతకంగా హతమార్చిన కసాయి భర్త

సారాంశం

వేధమంత్రాల సాక్షిగా పెళ్లాడిన భార్యను అతి కిరాతకంగా హతమార్చాడో కసాయి భర్త. ఈ అమానుష ఘటన మిర్యాలగూడలో చోటుచేససుకుంది.

నల్గొండ: కంటికి రెప్పలా కాపాడుకుంటానంటూ వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడిన భార్యనే అతి కిరాతకంగా హతమార్చాడో కసాయి భర్త. చెప్పినమాట వినకుండా కుటుంబంలో కలహాలు సృష్టిసోందని భార్యపై కోపాన్ని పెంచుకున్న భర్త శనివారం రాత్రి గొంతునులిమి హత్య చేసాడు. ఈ అమానుషం నల్గొండ జిల్లా (nalgonda district)లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... మిర్యాలగూడ (miryalaguda) పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గూడపూరి దీపక్, స్రవంతి దంపతులు నివాసముండేవారు. వీరికి ఏడేళ్ల క్రితం వివాహమవగా ఓ కొడుకు వున్నాడు. దీపక్ కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. 

ఏళ్లుగా సాఫీగా సాగిన వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్దలు పెరిగి గొడవ పెద్దదవడంతో ఇద్దరూ విడిపోయారు. అయితే భార్యభర్తల మధ్య గొడవ పోలీసులు, కోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. 

స్రవంతి కొడుకుతో కలిసి మిర్యాలగూడలోనే వుండగా దీపక్ మాత్రం నకిరేకల్ లో తల్లితో కలిసి వుండసాగాడు. అయితే తన మాట వినకుండా గొడవపడటమే కాదు కోర్టుకెక్కడంమే దీపక్ భార్యపై తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యను హతమార్చాలన్న దారుణ నిర్ణయానికి వచ్చాడు. 

శనివారం రాత్రి మిర్యాలగూడలో భార్యా, కొడుకు నివాసముంటున్న ఇంటికి వెళ్ళాడు దీపక్. ముందుగానే భార్యను హతమార్చాలని ప్లాన్ వేసుకుని వచ్చిన అతడు గొంతునులిమి చంపేసాడు. భార్య చనిపోయినట్లు నిర్దారించుకున్న దీపక్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.  

అతడి నుండి  వివరాలు సేకరించిన పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని స్రవంతి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తెు చేస్తున్నారు. 

ఇదిలావుంటే ఇటీవల చిత్తూరు జిల్లాలో ఇలాంటి దారుణమే వెలుగుచూసింది. అయితే మిర్యాలగూడలో భార్యను భర్త చంపితే చిత్తూరులో భార్యే భర్తను అతి కిరాతకంగా చంపింది. ఇలా భర్తను హతమార్చడమే కాదు తలతో సహా పోలీసులకు లొంగిపోయింది. రక్తం బట్టలతో క్యారీ బ్యాగులో తలను తీసుకెళ్తున్న నిందితురాలిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

రేణిగుంటలోని పోలీస్ లైన్ లో రవిచంద్రన్ తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. ఈ దంపతులకు 20 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే  హటాత్తుగా ఏమయ్యిందో తెలీదుగానీ భార్య చేతిలో రవిచంద్రన్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.  

గత గురువారం భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన రవిచంద్రన్ భార్య కత్తితో భర్తను చంపింది. భర్త చనిపోయిన తర్వాత తలను మొండెం నుండి వేరు చేసింది. భర్త తలను క్యారీ బ్యాగులో తన వెంట తీసుకొని  పోలీసులకు లొంగిపోయింది.  భర్తను హత్య చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!