హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. 10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..

Published : Jul 04, 2023, 10:50 AM IST
 హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. 10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..

సారాంశం

44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం భారీ ట్రాఫిక్‌ జామ్‌కు దారితీసింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జడ్చర్ల:  44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం భారీ ట్రాఫిక్‌ జామ్‌కు దారితీసింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాలు..  హైదరాబాద్-బెంగళూరు హైవేగా పిలవబడే 44వ జాతీయ రహదారి‌పై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వరి పొట్టు లోడుతో వెళ్తున్న లారీ.. మాచారం గ్రామ సమీపంలో బోల్తా పడింది. లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు హైవే వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి  చేరకుని లారీని రోడ్డు మీద నుంచి లారీని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక, ఈ హైవే మీదుగా తెలంగాణ నుంచి ఏపీలోని  రాయలసీమ, కర్ణాటకలకు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుంటారు. 

ఇదిలా ఉంటే, హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని సన్ సిటీ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మార్నింగ్ వాక్ కు వచ్చిన ఇద్దరు మహిళలు మృతిచెందారు. మృతులను తల్లీకూతుళ్లు అనురాధ, మమతలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారు అతివేగమే కారణంగా ప్రాథమికంగా నిర్దారణ అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?