Voter List: దేశవ్యాప్తంగా ఎన్నికలంటే మామూలు విషయం కాదు. జనాభాలో చైనాను దాటేసిన భారత్ లో ఎంతమందికి ఓటర్లు ఉన్నారు. అందులో ఎంతమంది పురుషులు.. ఎంతమందిస్త్రీలు..తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు? అలాగే.. శతాధిక ఓటర్లు ఎంత మంది అనే ఆసక్తికర విషయాలు మీ కోసం..
Voter List: దేశంలో సార్వత్రిక ఎన్నికల పండుగ మొదలైంది. ఈ పండుగ కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సిద్దమతున్నాయి. కొన్ని పార్టీ ఒంటరిలో పోటీ చేస్తుండగా.. మరికొన్ని పార్టీ కూటములు కడుతున్నాయి. ఈ తరణంలో సీట్ల సర్దుబాటు కోసం కసరత్తులు మొదలు పెట్టగా.. మరికొన్ని పార్టీలు దూకుడు పెంచి.. ఏకంగా అభ్యర్థులనే ప్రకటించాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను సైతం విడుదల చేసింది. అలాగే.. దేశం వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమలులోకి వచ్చేసింది.
ఇదంతా సరే.. దేశవ్యాప్తంగా ఎన్నికలంటే మామూలు విషయం కాదు. జనాభాలో చైనాను దాటి ముందుకు వెళ్తున్న భారత్ లో ఎంతమందికి ఓటుహక్కు ఉంది? అందులో ఎంతమంది పురుషులున్నారు? ఎంతమంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ లెక్కల కోసం నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. అయితే..కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం.. దేశంలో 97.8 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో 49.72 కోట్ల మంది పురుషులు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ సారి ఏకంగా 1.82 కోట్ల మంది ఓటర్లు మొదటి సారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఓటర్ల జాబితాలో దాదాపు 2 లక్షలకు పైగా ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు.
ఈ తరుణంలో తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో మొత్తం 4,08,07,256 ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,00,09,275 మంది పురుషులు కాగా,2,07,37,065 మంది మహిళలు. అలాగే..3,482 మంది థర్డ్ జెండర్స్ , ఇక సర్వీస్ ఓటర్లు 67,434 మంది. ఇందులో 7.88 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక అక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఏపీలో వంద సంవత్సరాలు పైబడిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ ఎన్నికల్లో ఏపీలో 5.8 లక్షల మంది ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోనున్నారు
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. తెలంగాణలో మొత్తం 3,30,37,113 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మొత్తం ఓట్లరల్లో 1.64 కోట్ల మంది పురుషులు, 1.65 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 7,19,104 మంది నూతన ఓటర్లు. ఇదిలా ఉంటే.. మొత్తం ఓటర్లలో 80 ఏండ్లు దాటినవారు 4,54, 230 మంది ఉండగా, దివ్యాంగులు 5,28,405 మంది ఉన్నట్టు తెలిపారు.
ఇంటి నుంచే అవకాశం
లోక్ సభ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన వారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేయవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ పద్దతిని అమలు చేస్తున్నారు.
ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోవాలంటే.. 85 ఏళ్లు పైబడిన వారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు స్థానిక బీఎల్‌వోలకు సమాచారం ఇవ్వాలి. వారు 12 డి ఫారం అందజేస్తారు. అందులో పూర్తి వివరాలు నమోదు చేసి తిరిగి బీఎల్‌వోలకు ఇవ్వాలి. వాటిని ఆర్‌వోలకు అందజేస్తారు. పోలింగ్ తేదీ కంటే ముందు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు ఎవరు పేర్లు నమోదు చేసుకున్నారో వారికే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. 88.4 లక్షల మంది దివ్యాంగుల ఓటర్లతో పాటు 85 ఏళ్లు పైబడిన 82 లక్షల మంది ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు. 2.18 లక్షల మందికి పైగా ఉన్న శతాధిక వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోబోతున్నారు.