తెలంగాణలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Published : Mar 21, 2024, 09:43 PM IST
తెలంగాణలో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. అభ్యర్థుల మూడో జాబితా విడుదల

సారాంశం

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేసింది.  

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) తాజాగా అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మొత్తం 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణలోని ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

తెలంగాణలోని ఐదు లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. పెద్దపల్లి (ఎస్‌సీ) నుంచి గడ్డం వంశీ కృష్ణ, మల్కాజ్‌గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ (ఎస్‌సీ) డాక్టర్ మల్లు రవిని అభ్యర్థులుగా కన్ఫమ్ చేసింది.

మూడో జాబితాలో అరుణాచల్ ప్రదేశ్‌ నుంచి ఇద్దరు అభ్యర్థులను, గుజరాత్‌ నుంచి 11 మంది అభ్యర్థులను, కర్ణాటక నుంచి 17 మంది అభ్యర్థులను, మహారాష్ట్ర నుంచి ఏడుగురిని, రాజస్తాన్ నుంచి ఆరుగురిని, పశ్చిమ బెంగాల్ నుంచి ఎనిమిది మంది అభ్యర్థులను, పుదుచ్చేరి నుంచి ఒక్క అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
సైబర్ మోసాలపై అలర్ట్ చేసిన నాగార్జున సూపర్ స్పీచ్ | Akkineni Nagarjuna Cyber Awareness Programme