BJP: పార్లమెంటు బరిలో తమిళిసై.. చెన్నై సౌత్ నుంచి పోటీ

Published : Mar 21, 2024, 08:05 PM IST
BJP: పార్లమెంటు బరిలో తమిళిసై.. చెన్నై సౌత్ నుంచి పోటీ

సారాంశం

తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిగా బీజేపీ తన మూడో జాబితాలో వెల్లడించింది.  

లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో తమిళనాడు నుంచి తొమ్మిది పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో ఆసక్తికరంగా తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పేరు కనిపించింది. ఆమె చెన్నై సౌత్ నుంచి లోక్ సభ బరిలో ఉన్నారు. 

తమిళనాడు గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై ఇటీవలే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం, ఆమె తిరిగి బీజేపీలో చేరారు. తద్వార మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు.

చెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ చేస్తుండగా.. తమిళనాడు బీజేపీ చీప్ కే అన్నామళై కోయంబత్తూర్ నుంచి బరిలో ఉన్నారు. ఇక చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పి సెల్వం, వెల్లూరు నుంచి డా ఏ సీ షణ్ముగం, కృష్ణగిరి నుంచి సి నరసింహన్, నీలగిరిస్ నుంచి డాక్టర్ ఎల్ మురుగన్, పెరంబలూరు నుంచి టీఆర్ పార్వేందర్, తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్, కన్యాకుమారి నుంచి పొన్. రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
సైబర్ మోసాలపై అలర్ట్ చేసిన నాగార్జున సూపర్ స్పీచ్ | Akkineni Nagarjuna Cyber Awareness Programme