నా భర్తను హత్య చేశారు: హోంగార్డు రవీందర్ భార్య సంధ్య

By narsimha lode  |  First Published Sep 8, 2023, 10:29 AM IST

తన భర్తను హత్య చేశారని హోంగార్డు రవీందర్ భార్య సంధ్య ఆరోపించారు. తన భర్త ఆత్మహత్య చేసుకోలేదని ఆమె చెప్పారు.



హైదరాబాద్: తన భర్తపై పెట్రోల్ పోసి హత్య చేశారని  హోంగార్డు  రవీందర్ భార్య సంధ్య ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన  రవీందర్  డీఆర్‌డీఓ అపోలో  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారంనాడు మృతి చెందారు. హోంగార్డు  రవీందర్  మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  ఉస్మానియా ఆసుపత్రి వద్ద  ఓ తెలుగు న్యూస్ చానెల్ తో  సంధ్య మీడియాతో మాట్లాడారు.  తన భర్త  ఫోన్ ను ఆన్ లాక్ చేసి డేటా ను డిలీట్ చేశారని  సంధ్య  ఆరోపించారు. కానిస్టేబుల్ చందు,  ఎఎస్ఐ నర్సింగరావు  తన భర్త రవీందర్ ను హత్య చేశారని సంధ్య ఆరోపించారు.  హోంగార్డు కార్యాలయం వద్ద  సీసీటీవీ పుటేజీని ఇవ్వాలని  కోరినా ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు.

 హోంగార్డు కార్యాలయంలో పనిచేసే  అధికారి  హమీద్  ఈ నెల  5వ తేదీన  పెట్రోల్ బంక్ లో ప్రమాదం జరిగిందని చెప్పాలని  తనకు చెప్పారన్నారు. అలా చెబితేనే ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ వస్తాయని చెప్పారని  ఆమె గుర్తు చేసుకున్నారు.  తన భర్తను చంపి  ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె  పేర్కొన్నారు. 

Latest Videos

also read:హోంగార్డ్ రవీందర్ మృతి.. ఉస్మానియాకు మృతదేహం...

తన భర్త చాలా సిన్సియర్ గా  విధులు నిర్వహిస్తాడని చెప్పారు.తాను  ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేసినా తనకు కూడ చలాన్ విధించారన్నారు.  హోంగార్డు కార్యాలయంలోనే  ఏదో జరిగిందని  ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తాను ఆరోపణలు చేస్తున్న ఇద్దరిపై  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్  చేశారు.  

click me!