Hyderabad: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ వారం ప్రారంభం నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిన పరిస్థితులు ఉన్నాయి.
Heavy rain forecast in Telangana: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఈ వారం ప్రారంభం నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిన పరిస్థితులు ఉన్నాయి.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, రాజధాని నగరం హైదరాబాద్ లో కూడా వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.
జంటనగరాల పరిధిలో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందనీ, ఒకటి లేదా రెండు సార్లు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయనీ, పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్డీపీఎస్) వాతావరణ బులెటిన్లు తెలిపాయి.
తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయనీ, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయనీ, రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత గణనీయంగా తగ్గిందని తెలిపారు. అత్యధికంగా దుమ్ముగూడెం (కొత్తగూడెం)లో 8 సెంటీమీటర్లు, మర్పల్లిలో 8 సెంటీమీటర్లు, కొత్తపల్లి (మంచిర్యాల)లో 7 సెంటీమీటర్లు, పినపాకలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జీహెచ్ఎంసీ పరిధిలో కూకట్ పల్లి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 34 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.