
హైకోర్టులో తెలంగాణా ప్రభుత్వానికి దెబ్బ తగిలింది.
తెలంగాణ ప్రభుత్వం జరిపిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ నియామకం పై హైకోర్టు స్టే విధించింది.
నియామక విధానం చట్ట ప్రకారం జరుగలేదంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ సంస్థకు ఛెయిర్మన్ గా గుడిమల్ల రవికుమార్ అనే వ్యక్తి ని నియమించారు. ఆయన రాజకీయ నాయకుడు, టిఆర్ ఎస్ కార్యదర్శిగా కూడాపనిచేశారు. గత ఎన్నికలలో పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే, ఆయన పోటీ చేసే అవకాశం దొరకలేదు. అపుడు ఆయను ఈ కీలకమయిన రాజ్యాంగ సంస్థకు ఛెయిర్మన్ గా నియమించారు.
దీనిని బాలల హక్కుల పరిరక్షణ యాక్టివిస్టు, కమిషన్ మెంబర్ సవాల్ చేశారు.
కమిషన్ నియమావళి 3 ప్రకారం బాలల పరిరక్షణకు సంబంధించి కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న వారినే నియమించాలి.
రూల్ 4 ప్రకారం సెలక్షన్ కమిటీ చైర్మన్ లేకుండా కమిషన్ చైర్ పర్సన్ నియామకం చేపట్టడం నిబంధనలకు విరుద్ధం.
గుడిమల్ల నియమాకం ఈ కారణాల వల్ల చెల్లదని పిటిషన్ అచ్యుత రావు పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి పిటిషన్ తరఫున కోర్టుకు హజరయ్యారు.
పిటిషనర్ వాదనతో హైకోర్టు.ఏకీభవించింది. తదుపరి ఉత్తర్వులు వెల్లువరించే వరకునియామకం మీద స్టే విధించింది.
మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM