
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పై జాతీయ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ మొదలయింది.
పర్యావరణ అనుమతులు లేకుండానే నిర్మాణం చేపడుతున్నారంటూ ప్రాజెక్టు నిర్వాసితుడు హయత్ ఉద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాజక్టు
వెంటనే పనులను నిలిపి వేయాలని పిటిషనర్ కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు పర్యావరణ అనుమతులు, అటవీశాఖ అనుమతులు లేవు,వైల్డ్ లైఫ్ అనుమతులు లేవని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ట్రిబ్యునల్ కేసును
సెప్టంబర్ 6కి విచారణ వాయిదా వేసింది. తాగు నీటి అవసరాల కోసం ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వంధర్మాసనానికి తెలియచేసింది..
ప్రాజెక్ట్ ను ఎందుకు ఆపకూడదో తెలంగాణా నుంచి వివరణ తీసుకోవాలని మహారాష్ట్రధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది.
తదుపరి విచారణ లోగ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చింది.
మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM