2 వారాల్లో తేల్చండి: ఆర్టీసీపై లేబర్‌ కమిషనర్‌‌కు హైకోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Nov 18, 2019, 5:27 PM IST

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో ఈ సమస్యను పరిష్కరించాలని హైకోర్టు లేబర్ కమిషనర్‌ను ఆదేశించింది.


హైదరాబాద్: రెండు వారాల్లో ఆర్టీసీ సమ్మె పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తామని హైకోర్టు  చెప్పింది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సమ్మెను విరమించాలని హైకోర్టు జేఎసీ నేతలను కోరింది.

Also read:కేసీఆర్ కు జగన్ షాక్: ఆర్టీసీపై మొండిపట్టు, టీపీసీసీ రేసులో రేవంత్

Latest Videos

undefined

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు విచారించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఇరువర్గాలు తమ వాదనను విన్పించాయి.ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వంతో పాటు ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

Also read:ప్రభుత్వాన్ని విపక్షాలు కూలుస్తాయి: సునీల్ శర్మను డిస్మిస్ చేయాలన్న ఉత్తమ్

తమకు కూడ కొన్ని పరిమితులు ఉంటాయని హైకోర్టు అభిప్రాయపడింది. పరిధిని దాటి ముందుకు వెళ్లలేమని  హైకోర్టు చెప్పింది.ఈ విషయాన్ని పరిష్కరించాలని కోరుతూ కార్మిక కమిషనర్‌ను ఆదేశిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది.

రెండు వారాల్లో ఈ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించింది.  ఈ విషయాన్ని కార్మికశాఖ న్యాయస్థానం చూసుకొంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది.  అయితే సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని  ఆదేశించింది. ఆర్టీసీ సమ్మె విషయంలో తాము పరిధి దాటి ముందుకు వెళ్లలేమని హైకోర్టు చెప్పింది. 

click me!