ఒకే గోతిలో ప్రేమ జంట ఖననం: బతికి ఉన్నప్పుడు విడదీసి.. మరణం తర్వాత కలిపారు

By Nagaraju penumala  |  First Published Nov 18, 2019, 12:06 PM IST

బతికి ఉన్నప్పుడు వారిని ఎలాగూ కలపలేకపోయామని భావించిన ఇరుకుటుంబాల సభ్యులు కనీసం ఖననం అయినా ఇద్దర్నీ కలిసే చేయాలని అనుకున్నారు. ఆ ప్రేమ జంట మృతదేహాలను ఒకే గోతిలో పూడ్చిపెట్టి కన్నీటి వీడ్కోలు పలికారు. 
 


కరీంనగర్‌: ప్రేమించుకున్నారు, జీవితాంతం కలిసి ఉండాలన్న ఆశతో ఎన్నో ఆశలు కట్టుకున్నారు. అయితే అందుకు పెద్దలు అంగీకరించకపోవడంతో చావే శరణ్యమనుకున్నారు. బతికి ఉన్నంత కాలం కలిసి జీవించలేమని భావించిన ఆ జంట ఇక చావులోనైనా కలివాలనుకున్నారు. 

బతికి ఉన్నప్పుడు ఏలాగూ ఏకం కాలేమని భావించిన ఆ ప్రేమ జంట కనీసం కలిసైనా చనిపోవాలని భావించుకున్నారు. ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరూ తనువు చాలించారు. ఆ ప్రేమ జంట చనిపోవడంతో ఇరుకుంటుబాల పెద్దలు కన్నీటి పర్యంతమయ్యారు. 

Latest Videos

undefined

బతికి ఉన్నప్పుడు వారిని ఎలాగూ కలపలేకపోయామని భావించిన ఇరుకుటుంబాల సభ్యులు కనీసం ఖననం అయినా ఇద్దర్నీ కలిసే చేయాలని అనుకున్నారు. ఆ ప్రేమ జంట మృతదేహాలను ఒకే గోతిలో పూడ్చిపెట్టి కన్నీటి వీడ్కోలు పలికారు. 

ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలోని రాజారాం తండాలో చోటు చేసుకుంది. రాజారాం తండాకు చెందిన భూక్య శిరీష, లకావత్‌ మహిపాల్‌ పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు.

అయితే తమ ప్రేమ విషయాన్ని ఇటీవలే తల్లిదండ్రులకు తెలియజేశారు. అయితే శిరీష తల్లిదండ్రులు ఇటీవలే వేరే యువకుడితో పెళ్లి చేయడానికి నిశ్చితార్థం చేశారు. పెళ్లికి ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోవడంతో వారిద్దరూ తీవ్రమనస్తాపానికి గురయ్యారు.

పెద్దలను ఎదురించలేక, ప్రేమ పెళ్లి చేసుకోలేక చావే శరణ్యమని భావించుకున్నారు. కరీంనగర్‌లో చదువుతున్న మహిపాల్‌ ప్రియురాలికి పెళ్లి నిశ్చయమైందని తెలుసుకుని  స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. 

శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన శిరీష, మహిపాల్‌లు శనివారం సిరికొండ శివారులోని అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరికి ఆదివారం బంధువులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపారు. 

ఇద్దరిని ఒకే గోతిలో ఖననం చేశారు. బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట చివరికి మరణంలో ఏకం కావడం, వారిద్దరిని కూడా ఒకే గోతిలో ఖననం చేయడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి అంగీకరించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వారంతా తలచుకున్నారు. 
 

 

click me!