జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఇద్దరి మృతి

Published : Nov 18, 2019, 04:03 PM ISTUpdated : Nov 18, 2019, 06:49 PM IST
జీడిమెట్ల కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఇద్దరి మృతి

సారాంశం

హైద్రాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.

హైద్రాబాద్ జీడిమెట్లలోని పారిశ్రామిక వాడలో సోమవారంనాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. మంటల్లో కార్మికులు చిక్కుకొన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

హైద్రాబాద్  జీడిమెట్ల పారిశ్రామికవాడలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు అనుమానిస్తున్నారు.

కెమికల్ ఫ్యాక్టరీ నుండి  భారీగా శబ్దం విన్పించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. రియాక్టర్ పేలుడు వల్లే ఈ శబ్దం విన్పించిందని చెబుతున్నారు. ఈ రియాక్టర్ పేలుడు వల్ల మంటలు వ్యాపించినట్టుగా అనుమానిస్తున్నారు.

మంటలను  ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించగా.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ఈ ప్రమాదాలతో కార్మికులు మృత్యువాత పడుతున్నారు. కొందరు గాయాలకు గురౌతున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!